డ్రాగన్ పండు వలన కలిగే ప్రయోజనాలు:
డ్రాగన్ పండు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డ్రాగన్ పండులో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా డ్రాగన్ పండు లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. డ్రాగన్ పండులో మినరల్స్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ఇలాంటివి కూడా డ్రాగన్ పండు లో ఉంటాయి. డ్రాగన్ పండులో విటమిన్ - సి, బి 1, బి 2, బి 3ఇలాంటి విటమిన్లు కూడా ఉంటాయి. డ్రాగన్ పండు గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.
డ్రాగన్ పండు వలన కలిగే ఆరోగ్య లాభాలు
- డ్రాగన్ పండులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ గుండెకి చాలా మంచిది. తలచుగా డ్రాగన్ పండును తినడము వలన గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
- డ్రాగన్ పండులో బీటా కెరోటిన్ ఉండడం వలన కంటి రెటీనాకు మంచిది. డ్రాగన్ పండుని రోజు తినడం వలన కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
- డ్రాగన్ పండు తరచూ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనివలన గుండె సమస్యలను రాకుండా చేస్తుంది.
- డ్రాగన్ పండులో పీచు ఉండటం వలన జీర్ణ క్రియను పెంచుతుంది. అంతేకాకుండా బరువును కూడా అదుపులో ఉంచుతుంది.
- డ్రాగన్ పండులో ఫైబర్ ఉండటం వలన మధుమేహ సమస్యలను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్ ని పెరగనీయకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తరచుగా డ్రాగన్ పండును తింటే చాలా మంచిది.
- డ్రాగన్ పండుని తరచూ తింటూ ఉంటే మెదడు పనితీరు పెరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
- డ్రాగన్ పండులో విటమిన్ సి ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- డ్రాగన్ పండులో మెగ్నీషియం ఉండటం వలన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజు ఒక డ్రాగన్ పండును తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- డ్రాగన్ పండులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వలన అర్ధరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది.
- డ్రాగన్ పండులో విటమిన్ సి ఉండటం వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోజు ఒక గ్లాస్ డ్రాగన్ పండు జ్యూస్ తాగుతూ ఉంటే చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
ఫ్యాక్స
1. డ్రాగన్ పండుని ఎప్పుడు తింటే మంచిది?
జ. ఏప్పుడైనా తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ టైంలో తీసుకోండి. స్నాక్స్ తిన్నట్లు ఉంటుంది ఇంకా పండు తిన్నట్లు కూడా ఉంటుంది.
జ. ఏప్పుడైనా తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ టైంలో తీసుకోండి. స్నాక్స్ తిన్నట్లు ఉంటుంది ఇంకా పండు తిన్నట్లు కూడా ఉంటుంది.
2. చిన్నపిల్లలు డ్రాగన్ పండును తినవచ్చా?
జ. చిన్నపిల్లలు డ్రాగన్ పండును తినొచ్చు. చిన్నపిల్లలు డ్రాగన్ పండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
3. ఏన్ని సంవత్సరాల చిన్న పిల్లల నుంచి డ్రాగన్ పండును తినిపించవచ్చు?
జ. ఒక సంవత్సరం పిల్లల నుంచి ముసలి వారి వరకు తినవచ్చు.
జ. ఒక సంవత్సరం పిల్లల నుంచి ముసలి వారి వరకు తినవచ్చు.
4. రోజు డ్రాగన్ పండుని తినవచ్చా?
జ. రోజు డ్రాగన్ పండుని తినడం వలన ఏలాంటి ఆరోగ్య సమస్యలు రావు. రోజు ఒక డ్రాగన్ పండును తింటే మంచిది.
5. డ్రాగన్ పండులో ఏ రంగు ఉన్న డ్రాగన్ పండు తింటే మంచిది?
జ. రంగులతో సంబంధం లేదు. ఏ రంగు పండు అయ్యిన తినవచ్చు.
6. రాత్రి నిద్రపోయే ముందు డ్రాగన్ పండుని తినొచ్చా?
జ. రాత్రి నిద్రపోయే ముందు డ్రాగన్ పండుని తినవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు డ్రాగన్ పండు తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుపు పడుతుంది.
7. డయాబెటిస్ ఉన్నవారు రోజు డ్రాగన్ పండును తినటం వలన షుగర్ లెవెల్ కంట్రోల్ లోనే ఉంటుందా?
జ. డయాబెటిస్ ఉన్నవారు రోజు ఒక డ్రాగన్ పండును తినవచ్చు. రోజు ఒక పండును తినడం వలన షుగర్ లెవెల్ పెరగవు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజు ఒక డ్రాగన్ పండు తినడం వలన మంచి శక్తి ఉంటుంది.