చిదంబరం రహస్యం అంటే ఏమిటి..... అంత రహస్యమైన ఆలయంలో ఏముంది.....
భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైన ఆలయము చిదంబర ఆలయము. చిదంబరము అనగానే మనకు చిదంబర రహస్యమే గుర్తుకు వస్తుంది. తమిళనాడులో చిదంబర ఆలయము ప్రఖ్యాతి చెందిన క్షేత్రము. ఇక్కడ కొలువైన నటరాజ స్వామి ఆధ్యాత్మికంగానే కాకుండా ఈ సృష్టి ఆవిర్భావాన్ని వివరించే కాస్మిక్ దైవంగా విదేశీయులు భావిస్తారు. ఇక్కడికి ఎక్కువగా విదేశీయ శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు. వారే ఈ ఆలయము పై ఎక్కువ పరిశోధనలు చేశారు. చిదంబరం అనే పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చిదంబర రహస్యము. ఇంతకు చిదంబర రహస్యం అంటే ఎంతో ఇప్పుడు తెలుసుకుందాము.
చిదంబరం లో ఉన్న నటరాజ స్వామి విగ్రహము
చిదంబరం పంచభూత శివ క్షేత్రాల్లో ఒకటి. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడి శివమూర్తి నటరాజ స్వామిగా ప్రఖ్యాతి చెందారు. నాట్య శాస్త్రానికి ప్రతీకగా ఆ నాట్యంలోనే ఈ కాస్మిక్ సైన్స్ ను వివరించే శాస్త్రవేత్తగా నటరాజస్వామి విగ్రహము కనిపిస్తుంది. సృష్టి ఏర్పడినప్పుడు భగభగ మండే నక్షత్ర గోళాలకు ప్రత్యేకగా ఆ స్వామి విగ్రహం చుట్టూ ఉండే అగ్ని సూచిస్తూ ఉంటుంది. నటరాజస్వామి డమరుకం నుంచి ఓంకారము వస్తు ఉంటుంది. ఆ శబ్ద శక్తి నుంచి ఇతర శక్తులు ఉద్భవించాయని ఇక్కడి పెద్దలు చెబుతూ ఉంటారు. ఈయన ఒక కాలితో కాలాన్ని ఇంకొక కాలితో సృష్టిని నడిపించే శక్తులను సమానంగా చేస్తూ ఉంటారు. అందుకని ఆ విగ్రహంలో అంత రహస్యం ఉంది. చిదంబరంలో ప్రధాన నటరాజ స్వామి విగ్రహాన్ని మరకతమతో చెక్కారు. మరకతముతో ఒక విగ్రహాన్ని తయారు చేయడము చాలా కష్టము. మరి ఏ కాలంలో ఎవరు ఈ విగ్రహాన్ని చేయుచుంటారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యము. ఈ ఆలయంలో పక్కపక్కనే నటరాజస్వామి, గోవిందరాజుల స్వామి ఇద్దరు పూజలు అందుకుంటారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యము. ఇక్కడి నటరాజస్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శివ మూర్తి.
ఎంతోమంది ప్రయత్నించిన ఇప్పటికీ చిదంబర రహస్యం అనేది ఒక అంతుచిక్కని రహస్యము. కానీ చిదంబరం గురించి ఎంతోమంది ఋషులు ఎన్నో వివరాలు చెప్పారు. ఆ గ్రంథాల్లోని విశేషాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి.
వేల సంవత్సరాల క్రితము శివ భక్తులు అయిన నయన్ మార్లు నటరాజ స్వామి గురించి చాలా విషయాలు రచించారు. వీరిలో ఒకరైన తిరుమూలాన్ తిరుమందిరము అనే ఒక గొప్ప కావ్యాన్ని రచించారు. ఆ కావ్యంలో చిదంబరం రహస్యాలను వివరించారు. మనిషిలో ఆత్మ సాక్షాత్కార్యానికి మానవ శరీర నిర్మాణ శాస్త్రనికి దృశ్య రూపమే చిదంబరం ఆలయము. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవ శరీర నిర్మాణ శాస్త్రము గురించి స్పష్టమైన సిద్ధాంతాని తిరుమూలాన్ రచించారు. చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి కాలి బొటన వేలు ఈ విశ్వంలో ఐస్కాంత క్షేత్రానికి సరిగ్గా కేంద్రము. ఇదే విషయాన్ని ఎంతోమంది విదేశీయు శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే తిరుమూలాన్ ఎలా రాయగలిగారు అనేది ఒక పెద్ద రహస్యము. ఈ ఆలయము ఈ విశ్వ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు.
పంచభూత లింగాలలో చిదంబర ఆకాశ లింగము. అంటే కాస్మిక్ శక్తికి చిహ్నము. సృష్టిలో మొదట ఆకాశము, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత భూమి ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. వీటికి సంబంధించిన ఆలయాలని ఒకటే సరళరేఖ మీద ఉన్నాయి. భూమికి 76 డిగ్రీల రేఖాంశములో ఆకాశ లింగమైన చిదంబరం, వాయు లింగమైనా శ్రీకాళహస్తి, పృద్వి లింగమైన కంచి ఒకే రేఖ మీద ఉండడము యాదృచ్ఛికము కాదు. ఇది కచ్చితంగా సైన్స్. ఈ మూడు ఆలయాలు ఒక చక్రవర్తి కట్టినవి కాదు. ఒకే కాలంలో నిర్మించినవి కాదు. అంటే ఈ భూమి మీద అయస్కాంత శక్తుల నియంత్రణ కోసము ఆ లింగాలు ఒకేసారి స్వయంభుగా వెలిసాయని అనుకోవాలి.
శరీరము ఎలా ఉంటుందో చిదంబరం ఆలయం కూడా అలాగే ఉంటుంది
ప్రతి మనిషిలోను పంచభూతాలు ఉంటాయి. ఈ సృష్టి నుంచే ప్రాణము జీవము పోసుకుంటుంది. ప్రతి మనిషిలోనూ ఆకాశ తత్వము, భూతత్వము, వాయువు తత్వము, అగ్ని తత్వము, జల తత్వము ఉంటాయి. అవే మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరము ఎలా ఉంటుందో చిదంబరం ఆలయం కూడా అలాగే ఉంటుంది. చిదంబరంలో 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఇది మనిషిలోని నవరంద్రాలకు సూచికం. చిదంబరం ఆలయము పై కప్పు ని 21,600 బంగారు రేకులతో నిర్మించారు. ప్రతి మనిషి ప్రతి రోజు 21,600 సార్లు శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడము చేస్తారు. అంటే ఉచ్వాస, నిచ్వాస ల సంఖ్య 21,600. ఇది యోగా శాస్త్రములో ఉంటుంది. ఈ ఉచ్వాస, నిచ్వాస లే మనిషి ఆయుష్షును లెక్కిస్తుంది. ప్రాణయామం ద్వారా శ్వాసను నియంత్రించగలిగే యోగులు వందల యేలు జీవిస్తున్నారు. చిదంబరం ఆలయము పై గోపురం ఉన్న బంగారు రేకులను అతుకు పెట్టేందుకు 72,000 బంగారు రేకులను ఉపయోగించారు. మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్య 72,000 అని ఆయుర్వేదం ఇంకా ఎన్నో గ్రంథాలు చెబుతున్నాయి. ఆ నాడుల వల్లే శరీరము నడుస్తుంది. దేవాలయంలో నటరాజ స్వామి కొలువు ఉండే గర్భాలయాన్ని పొన్నంబలం అని అంటారు. ఇది ఆలయ ప్రాంగణానికి కాస్త ఎడమవైపు ఉంటుంది. మన శరీరంలో ప్రాణాలను నిలిపే ముఖ్యమైన భాగము గుండె. గుండె మన శరీరంలో ఎడమవైపున ఉంటుంది. గుండె లాంటి గర్భాలయాన్ని ఎడమ వైపున ఉండేలాగా నిర్మించారు. చిదంబరం గర్భాలయం అయినా పొన్నంబలం అటు ఇటు కనక సభ, చిత్ సభ ఉంటాయి. కనక సభలో ఉండే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీక. పొన్నంబలం లో 28 స్తంభాలు ఉంటాయి. అవి శైవ ఆగమాలన సూచిస్తాయి. పొన్నంబలం, చిత్ సభ, కనక సభలను నిలబడుతున్న పైకప్పు వాసాల సంఖ్య 4096. 4096 కి వర్గమూలం 64. మన సంప్రదాయ కలలు 64. అలాగే కలలను ప్రదర్శించాలంటే శరీరంలో ఆరోగ్యం బాగుండాలి, రక్త ప్రసరణ బాగుండాలి. అప్పుడే ఆరోగ్యం కలలకు సహకరిస్తుంది. అందుకు సూచికంగానే 4096 సంఖ్య. ఎందుకంటే మానవ శరీర నిర్మాణ ప్రకారము మన శరీరంలో ప్రధాన రక్తనాళాల సంఖ్య 4096. నటరాజస్వామి నృత్య భంగిమను కాస్మిక్ డాన్స్ గా ఎందరో విదేశీ శాస్త్రవేత్తలు చెప్పారు.
చిదంబరం అంటే చిత్ అంబరము. ఇందులో చిత్ అంటే జ్ఞానము, అంబరము అంటే ఆకాశము. అంటే ఆకాశంలో ఉన్న శూన్యతత్వానికి జ్ఞానానికి సూచికే నటరాజస్వామి చెప్పేందుకు ఆ పేరు. ఇంకా ఆకాశ శాస్త్రము లేదా కాస్మిక్ ఫిజిక్స్ కి మధ్యన ఈ చిదంబరం ఆలయాన్ని చెబుతారు. నటరాజస్వామి నృత్యం సృష్టి ఏర్పడిన నాటి పరిస్థితులను వివరిస్తుంది. నటరాజ స్వామి నృత్యాన్ని ఆనంద తాండవము అని అంటారు.
చిదంబరం ఆలయంలో ఉన్న రహస్య అర
చిదంబరం ఆలయంలో నటరాజ స్వామి విగ్రహానికి కుడివైపున ఒక రహస్య అర ఉంటుంది. ఆ అర కు ఎప్పుడు ఒక వస్త్రము తెరలాగా కప్పి ఉంచుతారు. రోజు కొన్ని సెకండ్ల పాటు ఆ తెరను తొలగించి భక్తులకు చూపించి మళ్లీ తెరను మూసేస్తారు. ఆ కిటికీ లాంటి రహస్య అరను చిదంబర రహస్యం అని అంటారు. నిజానికి ఆ కిటికీలో కనిపించేది శూన్యమే. ఆకాశము అంటే శూన్యతత్వము. ఆకాశ తత్వంలో ఉండే అయస్కాంత శక్తిని నిరాకారంగా చిదంబరంలో శివలింగం గా ఉంటుంది.
చిదంబరం ఆలయము గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే "ఆత్మ సాక్షాత్కారమే చిదంబర రహస్యము".