కివి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు



కివి పండు లో విటమిన్స్, మినరల్స్, ఆంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కివి పండులో విటమిన్ - సి అధికంగా ఉంటుంది. కివి పండు లో ఉండే నల్లటి విత్తనాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇందులో పీచు పదార్థము ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేవి. కివి పండులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కివి పండులో కొవ్వు పదార్దాము, సల్ఫర్ తక్కువ మోతాదులో ఉంటాయి.

కివి పండు వలన కలిగే ఆరోగ్య లాభాలు

  • కివి పండు రక్తపోటును నియంత్రిస్తుంది. అందువలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
  • రెండు లేదా మూడు కివి పండ్లను డైట్ లో తీసుకుంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.
  • కివి పండులో లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించి ఆస్తమాని తగ్గిస్తుంది.
  • కివి పండులో కొవ్వు పదార్దాము, సల్ఫర్ తక్కువ మోతాదులో ఉంటుంది. దీనివలన డయాబెటిస్ పేషంట్లకి చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారు రోజు కివి పండు ని తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
  • ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే డైజేషన్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. కివి పండులో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉండడము వల్లన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది.
  • ఇప్పట్లో చాలామంది చిన్నపిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తున్నాయి. కివి పండులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జియాజాంతిన్ లూటిన్ సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాకుండా కంటి శుక్లాలు రాకుండా కూడా చేస్తాయి. కివి పండు కంటి రెటీనాని కాపాడుతుంది. కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. కంటి సమస్యలు తగ్గాలి అంటే కివి పండుని రోజు డైట్ లో తీసుకోవాలి.
  • కివి పండుని రోజు తినడం వలన జ్వరాలు, జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వైరల్ జ్వరాలు వచ్చిన వాళ్లు కివి పండును తింటే త్వరగా వైరల్ జ్వరము తగ్గుతుంది.
  • కివి పండు లో కొలజన్ ఉంటుంది. ఇది ముఖంపై వచ్చే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. కివి పండు, అలోవెరా పేస్ట్ ను ముఖము పై ప్యాక్ చేసుకుంటే ముఖము పై ఉండే మొటిమలు తగ్గుతాయి.
  • బరువు తగ్గించడంలో కివి పండు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే కివి పండులో నీటి శాతము ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు కివి పండు ని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.
  • చాలామంది నిద్రలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కివి పండుని డైట్ లో తింటే నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. 2011లో జరిపిన పరిశోధనలో కివి పండు తినడం వల్లన మంచి నిద్ర పడుతుందని తెలిపారు.
  • శరీరంలో ఐరన్ సమస్యతో బాధపడే వాళ్ళు రోజు కివి పండు ని డైట్ లో తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
  • కివి పండులో ఐరన్ తో పాటు విటమిన్ - సి ఉండడము వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. కివి పండుని అరటిపండుతో కలిపి తీసుకుంటే రక్తహీనత త్వరగా తగ్గుతుంది.
  • కివి పండు, కీరదోస ముక్కలు చేసుకుని అందులో కొంచెం అల్లం వేసుకుని జ్యూస్ తయారు చేసుకుని రోజు త్రాగుతూ ఉంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీర బరువును  తగ్గిస్తుంది. కివి పండు, కీరదోస జ్యూస్ వేసవికాలంలో తీసుకుంటే ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. వేసవికాలంలో శరీరము డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది.

ఫ్యాక్స

1. కివి పండు ని ఎన్ని సంవత్సరాల పిల్లల నుంచి తినిపించవచ్చు?
జ. కివి పండు ని రెండు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి  ముసలి వాళ్ల వరకు తినవచ్చు.

2. కివి పండుని రోజు ఏ సమయంలో తీసుకుంటే మంచి ఆరోగ్యం లాభాలు ఉన్నాయి?
జ. కివి పండు ఉదయం లేదా రాత్రి నిద్ర పోయే ముందు  తీసుకుంటే మంచిది. రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది.

3. కివి పండు ని ఎంత మోతాదులో తింటే మంచిది?
జ. కివి పండు ని పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజు ఒక కివి పండును తింటే మంచిది. పైన చెప్పిన సమస్యలు లేని వారు వారానికి మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే మంచిది.

4. నిద్రలేని సమస్యతో బాధపడేవారు కివి పండును రాత్రి నిద్రపోయే ముందు ఏ సమయములో తింటే మంచిది?
జ. కివి పండు ని రాత్రి నిద్రపోయే గంట ముందు తిని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.

5. కివి పండును జ్యూస్ లాగా చేసుకొని త్రాగితే మంచిదా లేకపోతే పండులాగా తింటే మంచిదా?
జ. కివి పండును ఎలా అయినా తీసుకోవచ్చు. కివి పండును ఎలా తిన్న మంచి లాభాలు ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు జ్యూస్ రూపములో తీసుకుంటే మంచిది.

6. కివి, కీరదోస జ్యూస్ ని ఏ సమయంలో తీసుకోవచ్చు?
జ. కివి, కీరదోస జ్యూస్ ని ఉదయం పడి కడుపున తీసుకుంటే మంచిది లేకుంటే సాయంత్రం సమయమున తీసుకుంటే మంచిది.

7. డయాబెటిస్ ఉన్నవారు కివి పండు ని తింటే డయాబెటిస్ పోతుందా?
జ. డయాబెటిస్ ఒకసారి శరీరంలోకి వచ్చాక పోదు. కానీ కివి పండును డయాబెటిస్ ఉన్నవారు రోజు తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. కివి పండుని డయాబెటిస్ లేని వాళ్ళు తీసుకుంటే డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

8. కివి పండు ని రోజు తినడము వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
జ. కివి పండును రోజు తినడము వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజు కివి పండుని రోజు తినడము వలన ఆరోగ్యంగా ఉంటారు. రోజు తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే ఏమి కాదు. ఏదైనా సరే అమితంగా తింటే విషము మితంగా తింటే అమృతం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!