మెంతులను ఆహారములో తీసుకుంటే కలిగే లాభాలు

మెంతులను ఆహారములో తీసుకుంటే కలిగే లాభాలు:



రోజు మనము వంటల్లో ఎన్నో రకాల దినసులని వాడుతూ ఉంటాము. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు మెంతులు సంజీవిని లాగా పనిచేస్తాయి. రోజు మనము వంటల్లోకి వాడుకునే మెంతులు డయాబెటిస్ జబ్బును అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ మాత్రమే కాదు అధిక బరువు, కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో రకాల సమస్యలకి మెంతులు మంచి ఔషధము. వేల సంవత్సరాలుగా ముందు కూడా ఆయుర్వేదము మెంతులు, మెంతి ఆకు ప్రతిరోజు వాడమని చెప్పారు.

మెంతులు మన ఆరోగ్యానికి చేసే లాభాలు

  • మెంతులు మన శరీరంలో తగినంత వేడిని ఉత్పత్తి చేస్తాయి.
  • మెంతులు మన శరీరంలోని వాత, కఫాన్ని తగ్గిస్తాయి.
  • మెంతులు మన జీర్ణ వ్యవస్థని శక్తివంతము చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
  • మెంతులు పేగులు లోని లోపల ఉన్నా వాపులను తగ్గిస్తాయి.
  • మెంతులు లోని చేడు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. 
  • అధిక కొలెస్ట్రాల్ ని కూడా మెంతులు తగ్గిస్తోంది.
  • అధిక బరువు ఉన్నవారు కనుక రోజు మెంతుల్ని తీసుకుంటే బరువు తగ్గుతారు.
  • డయాబెటిస్ ఉన్నవారు రోజు మెంతుల ను తీసుకుంటే డయాబెటిస్ నిలకడగా ఉంటుంది.
  • మెంతులు మానవ శరీరంలోని విషాన్ని బయటికి పంపించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి.
  • పిసిఓడి లాంటి సమస్యలను కూడా మెంతులు మంచిగా తగ్గిస్తుంది.

మెంతి గింజల కి ఉన్న గుణము

మెంతులు చేడు రుచితో ఉంటుంది. మెంతులు ఉష్ణవిర్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మెంతులు రుక్ష గుణాన్ని కలిగి ఉంటుంది.

మెంతులను ఎలా తినొచ్చు

  • మెంతులని ఔషధంగా వాడుకోవడానికి మెంతులుగానే వంటలో వాడుకోవచ్చు.
  • మెంతులను వేయించి పొడి చేసి చూర్ణం లాగా చేసుకుని వాడుకోవచ్చు.
  • మెంతులను పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టి తినవచ్చు.
  • మెంతుల్ని టీ లాగా కషాయం లాగా కాల్చుకొని తాగవచ్చు.
  • మెంతుల పొడ్డిని నీటిలో వేసి త్రాగవచ్చు.

మెంతులని రోజుకు ఎంత మోతాదులో తీసుకోవచ్చు

మనకు ఉండే సమస్యను బట్ట లేదా మనిషి యొక్క బలాన్ని బట్టి తీసుకోవాలి. మెంతుల చూర్ణం అయితే రెండు నుంచి ఐదు గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోవచ్చు. కషాయంలో వాడుకున్నప్పుడు 30 నుంచి 100 మిల్లి లీటర్ల వరకు వాడుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవారు మెంతుల ని ఎలా తీసుకుంటే మంచిది 

మెంతులు లోని ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే రసాయనాలు మధుమేహాని చక్కగా అదుపులో ఉంచుతాయి. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు రోజు కొన్ని మెంతుల్ని నీళ్లు పోసుకుని మింగడం లేదా రోజు రెండు చెంచాల మెంతుల పొడిని నీటిలో లేదా పాలల్లో వేసుకొని తాగడం వలన డయాబెటిస్ చక్కగా అదుపులో ఉంటుంది.

కొలెస్ట్రాల్ ఉన్నవారు మెంతుల్ని ఎలా తీసుకుంటే మంచిది

కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజు 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీటిలో లేదా వెన్న తీసిన మజ్జిగలో కలిపి రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే పడి కడుపున తీసుకుంటే ప్రమాదకరమైన ఎల్.డి.ఎల్  కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

మెంతులు వల్లన జుట్టుకు కలిగే లాభాలు

  • రాత్రి పడుకునే ముందు మెంతులను పెరుగులో నానబెట్టి ఉదయాన్నే అందులో కొన్ని మందారం ఆకులను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి 30 నిమిషాల తర్వాత నీటితో తలస్నానము చేసుకోవాలి. ఇలా పట్టించడం వలన తలలో ఉన్న చుండ్రు తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు మృదువుగా మారుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే తలలో ఉన్న చుండ్రు పోయి జుట్టు ఒత్తుగా మారుతుంది.
  • మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేసి అందులో కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా తలలో ఉన్న చుండ్రు కూడా తగ్గుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు బాగా ఆరోగ్యంగా ఉంటుంది.
  • మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెంతుల ని మెత్తగా పేస్ట్ చేసి అందులో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో ఉన్న జిడ్డుని తగ్గిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే అందులో కొంచెం వేపాకులను వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తలలో ఉన్న చుండ్రు, దురదలు వంటివి తగ్గిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి 

ఫ్యాక్స

1. డయాబెటిస్ ఉన్నవారు మెంతుల పొడిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే త్రగొచ్చా?
జ. డయాబెటిస్ ఉన్నవారు రాత్రంతా నీటిలో మెంతుల పొడిని నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.

2. డయాబెటిస్ ఉన్నవారు రాత్రంతా మెంతుల పొడిని పాలల్లో నానబెట్టి తీసుకోవచ్చా?
జ. లేదు ఉదయము ఒక గంట ముందు పాలల్లో మెంతులను నానబెట్టి త్రావచ్చు.

3. మెంతులను తినడం వలన జుట్టుకు ఏమైనా లాభాలు ఉన్నాయా?
జ. మెంతులను తినడం వలన జుట్టుకు ఎలాంటి లాభము ఉండదు. మెంతులను జుట్టుకు పట్టిస్తే మంచి లాభం ఉంటుంది.

4. మెంతులు శరీరంలో వేడిని ఉత్పత్తిని చేయడం వలన ఏమైనా నష్టాలు ఉన్నాయా?
జ. మెంతులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడం వలన ఎలాంటి నష్టము ఉండదు.

5. మెంతులను రోజు తీసుకోవడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
జ. మెంతులను రోజు తీసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

6. మెంతులతో ఏమీ కలప కుండా జుట్టుకు పట్టించుకోవచ్చా?
జ. పట్టించుకోవచ్చు. అయితే రాత్రంతా నాన్న పెట్టి ఉదయము పట్టించుకుంటే మంచిది.

7. డయాబెటిస్ లేనివారు మెంతులను తినవచ్చా?
జ. తినవచ్చు. కానీ రోజు కాకుండా వారానికి ఒకసారి తీసుంటే మంచిది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!