ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారము తీసుకోవడం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారము తీసుకోవడం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు


ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అనేది చేపల్లోనే బాగా ఉంటుంది. చేపలు తినడము వలన గుండె కు చాలా మంచిది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాలకి ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ బాగా ఉపయోగపడుతుందని  అందరికీ అవగాహన ఉంది. అందుకని మేము చేపల్ని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కోసము తింటున్నామని చెబుతూ ఉంటారు చాలామంది. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అనేది చేపల్లోనే ఎక్కువగా ఉంటుంది మరి శాఖాహారం తినే వారికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అందదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. శాఖాహారంలో ఒమేగా త్రి ఎంత ఉంది? శాఖాహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య లాభాలు వస్తున్నాయి? శాఖాహారంలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ దేనిలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాము.

ఒక్క రోజులో తీసుకోవలిసిన ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్

ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ మనకి ఒక రోజుకి 1.5 గ్రామ్స్ - 2 గ్రామ్స్ వరకు ఈ కొవ్వు మన శరీరానికి తీసుకోవాలి.

ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ వల్లన కలిగే లాభాలు

  • మన శరీరంలో ఉన్న మొత్తం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. రక్తనాళాలలో  పూడికలు రాకుండా ఉండటానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బి.పి ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది ఒక ఆంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. మన శరీరము లోపల కణజాల జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, ఇన్ఫ్లమ్మషన్ ని తగ్గించడానికి అద్భుతంగా ఈ ఆంటీ ఆక్సిడెంట్ ఉపయోగపడతాయి.
  • ఒమేగా త్రీ మంచి ఆంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ఇది సూక్ష్మమైన రక్తనాళాల లోపల పొరను కాపాడుతూ ఉంటుంది. రక్తనాళాలలో ప్లేట్లెట్స్, కాల్షియం, చెడు కొలెస్ట్రాల్ ఇలాంటివి పేరుకోకుండా రక్తనాళాలలోని లోపల పొరను మంచిగా శుభ్రము చేస్తుంది.
  • మెదడు లోపల నుంచి శరీరము అంతా వెళ్లే నరాల పై పోరాను డ్యామేజ్ కాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ రక్షణ కలిగిస్తుంది.
  • ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారము బాగా తీసుకున్నట్లయితే మోకాళ్ళ మధ్యలో జిగురు పెంచేలాగా చేస్తుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్యలో వాపులు ఉన్నవారు రోజు ఒమేగా త్రీ ఫ్యాటి ఆసిడ్స్ ఉన్న ఆహారాము తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కీళ్ల నొప్పులు లేని వారు తీసుకుంటే నొప్పులు రాకుండా ఉంటాయి.
  • 15% పక్షవాతము రాకుండా నివారించడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా ఉపయోగపడుతుంది.
  • గుండె సమస్యలు రాకుండా రక్షించడానికి 20% ఉపయోగపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్.

ఒమేగా త్రీ ఉండే శాఖాహారము

చేపల్లో ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్ 200 మిల్లీగ్రాముల నుంచి 400 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అదే శాఖాహారంలో అయితే మెంతికూర, మునగాకులో రెండిట్లో ఒకటిన్నర గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాటి ఆసిడ్స్ ఉంటుంది. వాల్నట్స్ లో తొమ్మిది గ్రాముల ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటుంది. అవిసె గింజలలో 13 గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటుంది. చియా గింజలలో 18 గ్రాముల ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటుంది.

ఒమేగా త్రి ఫ్యాటి ఆసిడ్స్ ని ఎలా ఆహారములో తీసుకోవాలి

రోజు అవిసె గింజలను వేపించి పొడిలా కొట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. అలాగే ఉదయము గోరువెచ్చటి నీటిలో అవిసె గింజల పొడిని వేసుకొని త్రాగవచ్చు. అలాగే వాల్నట్స్, చియా గింజలు వీటిని నాన్నపెట్టుకొని తినాలి. వాల్నట్స్ అయితే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి. చియా గింజలు అయితే ఒక గంట సేపు నానబెట్టాలి. ఆకుకూరలు కూడా రోజు తీసుకోవడం మంచిది. కూరలు వండేటప్పుడు ఆకుకూరల ను పేస్ట్ లాగా చేసి కూరలో వేసుకోవచ్చు. మాంసాహారంలో కంటే శాఖాహారంలోనే ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!