ఉలవలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఉలవలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు........



ఉలవలు అనేసరికి గుర్రాలకి ఇచ్చే ఆహారంము కదా మనకెందుకు అని అనుకుంటారు. మనుషులు మనకంటే మంచి ఆహారాన్ని పశువులు బలంగా ఉండాలని ముందు వాటికి పెట్టడము ప్రారంభించారు. కాలక్రమేన రుచులకు అలవాటు పడి మంచి ఆహారాన్ని  మనము మానేసి మనకు ఇష్టమైనవి మనము తింటున్నాము. మనము తినే వాటిలో పోషకాలు లేక  అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యల నుంచి బయటపడి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చక్కటి పోషకాలు ఉండే ఆహారము లో ఉలవలు అతి ముఖ్యమైనవి. అలాంటి ఉలవలను మొలకలు కట్టి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

100 గ్రాముల ఉలవల్లో ఉండే పోషకాలు

100 గ్రాములు ఉలవలు తీసుకుంటే 329 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో పిండి పదార్థాలు అయినా కార్బోహైడ్రేట్స్ 57 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్లు  22 గ్రాములు ఉంటాయి. కొవ్వు పదార్థాలు అర్థ గ్రాము ఉంటాయి. ఇందులో పీచు పదార్థము 8 గ్రాములు ఉంటుంది. ఇవి ఉలవల్లో ఉండే స్థూల పోషకాలు.

ఉలవలను ఎలా తింటే మంచిది

ఉలవలని మనము పెసర్లు, బొబ్బర్లు, సెనగలు వీటితోపాటు నానబెట్టుకొని మొలకలు చేసుకొని తినవచ్చు. ఎప్పుడైనా ఉడకపెట్టుకొని గుగ్గిళ్ళ లాగా చేసుకుని తినవచ్చు. ఉలవచారు లాగా చేసుకుని  తినవచ్చు. వీటన్నిటికన్నా మొలకల ద్వారా చేసుకుని తింటే  మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఉలవలు తినడము వలన కలిగే లాభాలు

  • ముఖ్యంగా ఉలవల లో 57 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఇందులో 43% డైజెషన్ కావు. కాబట్టి ఇవి రక్తంలోకి వెళ్లలేవు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్లడము వలన మనకు ఊబకాయము, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనము ఉలవలను మొలకలు చేసుకొని తినడము వలన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్లకుండా పోషకాలు ఎక్కువగా వెళ్తాయి.
  • ఉలవల లో పైరోగ్లూటమిక్ గ్లూటమినే ఉండడము వలన శరీరము లోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్సులిన్ వలన డయాబెటిస్ రాకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజు ఉలవలను మొలకలు చేసుకొని తింటే చాలా మంచి ఆరోగ్య లాభాన్ని పొందొచ్చు.
  • ఉలవలు తిన్నప్పుడు ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫ్లోరా సహాయము చేసి పోషకాలను తయారు చేయడానికి బాగా సహాయపడుతుంది. అంటే బి -12, విటమిన్ - కె ఇంకా ఇతర పోషకాన్ని గ్రహించుకునేటట్లు చెయ్యటానికి బ్యాక్టీరియా ఫ్లోరా శరీరానికి బాగా సహాయపడుతుంది.
  • ఉలవలు రోజు తినడము వలన ప్రేగులలో క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
  • ఉలవలలో ఇనులిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది లోపల ప్రేగుల్లోకి వెళ్లి ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని ఇస్తుంది.
  • శక్తిని పెంచడము లో ఉలవలు బాగా పని చేస్తుంది.
  • ఉలవల లో ఉండే ప్రోటీన్ వలన కిడ్నీలో రాళ్లు రాకుండా చేస్తుంది.
  • ఉలవలని రోజు తినడము వలన బ్రెయిన్ లో ఉండే నరాలు బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా మతిమరుపు వంటి సమస్యలని కూడా  రాకుండా చేస్తుంది. మతిమరుపు సమస్య వున్నవారికి మతిమరుపును తగ్గించి జ్ఞాపకాశక్తిని పెంచుతుంది.
  • ఉలవలలో మంచి ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల జ్వరాలు వంటి జబ్బులు రాకుండా ఉంటాయి.
  • ఉలవలని తరచూ తినడము వలన రక్తపోటు రాకుండా చేస్తుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు తరచూ ఉలవలను తినడము వలన రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.
  • ఒబెసిటీ ఉన్నవారు రోజు ఉలవలని తింటే చాలా మంచిది. ఒబిసిటీకి సంబంధించిన క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. అలాగే ఒబిసిటిని తగ్గడానికి కూడా ఉలవలు బాగా సహాయపడతాయి.
  • బరువు తగ్గాలి అనుకునే వారికి ఉలవలు మంచి ఆహారము. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు ఉలవలను తింటే త్వరగా బరువు తగ్గుతారు.

ఆహారాలలో ఉదయము పూట అల్పాహారము లో మొలకలు కట్టుకొని తినే రకాలలో ఒక రకము ఏదైనా తగ్గించుకోనైనా ఉలవల ను చేర్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు ఈ రోజుల్లో పొందడము మంచిది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!