కంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు

కంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు.....


వయసుతో సంబంధము లేకుండానే కంటి చూపు తగ్గిపోవడము, సంవత్సరాలు గడిచే కొద్దీ కంటి చూపు తగ్గుతూ రావడము, రాను రాను అద్దాలు యొక్క మోతాదు పెరుగుతూ ఉండడము, కంటికి బాగా అలసట అనిపించడము ఇలాంటి సమస్యలు అన్ని ఈ రోజుల్లో చదువుకుంటున్న చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు కంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి.

కంటి చూపు రావడానికి గల ప్రధాన కారణాలు

ఎక్కువ పని ఒత్తిడి వల్ల నిద్ర లేకపోవడము వల్లన కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీ ఇలాంటివి ఎక్కువగా చూడటం వల్లన కంటి చూపు నశిస్తుంది. రాత్రిళ్ళు ఎక్కువగా కంటి మీద వెలుతురు పడడము వలన కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఎంత దూరము చేస్తే అంత మంచిదది.
కంటి చూపు తగ్గటానికి ప్రధాన కారణము పోషకాలు లోపించడము. పోషకాల తగ్గడము వలన ప్రధాన కారణంగా కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎలాంటి పోషకాలు తగ్గడము వలన కంటిచూపు సమస్యలు వస్తాయి

విటమిన్ - ఏ, విటమిన్ - సి, విటమిన్ - ఈ, విటమిన్ - డి, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఇలాంటి పోషకాలు మన శరీరములో తగ్గిపోవడము వలన కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటి చూపు దెబ్బ తినే వారిలో ఇవన్నీ లోపాలు కనిపిస్తాయి. ఇలాంటి పోషకాలు ఉండే ఆహారము తీసుకుంటే పిల్లలకు మరియు పెద్దలకు కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటి పోషకాలు పెరగాలి అంటే ఎలాంటి ఆహారము తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాదాము.

విటమిన్ - ఏ

విటమిన్ - ఏ అన్నిటికన్నా కరివేపాకు, కొత్తిమీర లో ఎక్కువగా ఉంటుంది. భోజనము చేసేటప్పుడు కొత్తిమీరను అలా పైన చల్లుకొని తినటము అలవాటు చేసుకుంటే కంటి చూపుకు మంచిది. ఆకుకూరలు రోజు తినడము వలన కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు రోజు ఆహారములో వేసి తీసుకోవడము వలన కంటి చూపు రాకుండా చేస్తుంది. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలలో కూడా విటమిన్ - ఏ ఉంటుంది. ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు అందులో తోటకూర లేదా పాలకూర పేస్ట్ లాగా చేసి వేసుకుని తింటే మంచిగా విటమిన్ - ఏ అందుతుంది.

విటమిన్ - సి

విటమిన్ - సి వేడి చేసిన వంటకాలలో నశిస్తుంది. అందుకని విటమిన్ - సి మనము వేడి చేయకుండా ఉండే వాటిని ఎక్కువగా వాడాలి. విటమిన్ - సి అన్నిట్లో కంటే జామకాయలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ ఒక జామకాయ ని పిల్లలకి తినిపిస్తే ఇది కంటిలో సెల్స్ ని కాపాడుతూ ఉంటుంది. కమలా పండులో కూడా విటమిన్ - సి ఎక్కువగా ఉంటుంది. రోజు పిల్లలకి ఒక గ్లాస్ కమలా పండు జ్యూస్ తాగిస్తే కంటిచూపు సమస్యని తగ్గిస్తుంది.

విటమిన్ - ఈ

విటమిన్ - ఈ ఎక్కువగా బాదంపప్పు, పొద్దుటిరుగుడు పువ్వు పప్పు లలో బాగా ఎక్కువగా ఉంటుంది. రోజు బాదంపప్పు, పొద్దుతిరుగుడు పప్పు తింటే విటమిన్ - ఈ బాగా అందుతుంది.

విటమిన్ - డి

విటమిన్ - డి అనేది నూటికి తొంబై మందికి పిల్లలకి విటమిన్ - డి లోపము ఉంటుంది. కంటికి కూడా విటమిన్ - డి లోపము అనేది హాని కలిగిస్తుంది. ఎండలో కొంచెం సేపు అయినా ఉండాలి. లేకుంటే విటమిన్ - డి టాబ్లెట్ వేసుకుంటూ ఉండాలి. ఈ విటమిన్ - డి టాబ్లెట్ ని నెలకి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది.

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా బాగా పనిచేసి కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా చియా సీడ్స్ లో ఉంటుంది. ఇది గంట ముందు నీటిలో నానబెట్టి తాగితే కంటికి చాలా మంచిది. వాల్ నట్స్ , అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఐదు పోషకాలు కంటి సమస్యకు చాలా అవసరము అని చాలా పరిశోధనలో చెప్పారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!