మధుర మీనాక్షి దేవాలయము విశేషాలు
కాలము ముందుకు పరిగెడుతున్న ఆ ప్రభావము తనపై పడకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్న మహిమాన్వితమైన నగరము మీనాక్షి దేవి కొలువున్న మధురై నగరం. ఈ ఆలయము అద్భుతమైన ఆలయము. నాలుగు మాడవీదుల కోడలిలో మధురై అను దివ్య నామముతో వెలుగొండే ఈ పుణ్యక్షేత్రము పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతములో కూడా వర్ణించబడింది ఈ ఆలయము.
వైగై నది
మణి వాచకుడు అనే భక్తుని కొరకు వైగై నదిని ఉద్భవింప చేయడం జరిగింది. ఈ మధురా నగరము అందానికి ముఖ్య కారణము ఇక్కడ ప్రవహించే వైగై నది. ఇరువైపులా గట్లు మీద ఉన్నట్టు వంటి రకరకాల వృక్షాల నుంచి రాలిన ఎన్నో రకాల పువ్వులు వాటి సువాసనలతో కలిపి ఎంతో సుందరంగా ముందుకు సాగిపోతుంది వైగై నది. ఈ వైగై నది గురించి తమిళ గ్రంధాలలో అద్భుతంగా వర్ణించబడింది. సహజంగా నదులు అన్ని సముద్రంలోనే కలుస్తాయి. అయితే ఈ వైగై నది మాత్రము సముద్రంలో కలవదు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు విషాన్ని సాగరుడు శివుడికి ఇచ్చారని కోపంతో నేను సముద్రంలో కలవను అని భావించింది వైగై నది. అందుచేతనే వైగై నది సముద్రంలో కలవదు. అటువంటి వైగై నది తీరాన పరమేశ్వరుడు, మీనాక్షి దేవి ఇద్దరూ కలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.
అందాల నగరము అయిన మధురకు నిదురించని నగరము అని కూడా ఒక పేరు ఉంది. తల్లి మీనాక్షి దేవి అనుక్షణం తన చల్లని చూపులతో సంరక్షించే అద్భుతమైన నగరము ఈ మధురై నగరము. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను ఏ మాత్రము మార్పు చేయకుండా ఆచరిస్తూ రావడము ఈ నగరానికి చెందిన గొప్ప విశేషము.
మధుర మీనాక్షి కథ
మధుర మీనాక్షి ఆలయము నాలుగు వైపులా పెద్ద పెద్ద గోపురాలతో విశాలమైన ఆవరణములో నిర్మించబడినది. మలయధ్వజ పాండ్యుని మనోవేదనను తొలగించేందుకు యాగము గుండములో ఉద్భవించిన పుత్రిక మధుర మీనాక్షి. తనను ఎదిరించి నిలిచేవారు లేకుండా హిమాలయాల వరకు జైత్రయాత్రను సాగించి జనరంజికంగా పరిపాలించిన మహారాణి మధుర మీనాక్షి. శివుడు మీనాక్షి అమ్మవారిని వివాహము చేసుకోవడము ద్వారా స్వర్ణభరణాలు మకుటం అన్ని ధరించి సుందరీశ్వరుడి గా వెలిగిపోతున్నారు అని కీర్తిస్తూ ఎందరో కవులు స్వామి వారిని వర్ణించారు.
ఆలయములోని గోపురాలు
ఈ ఆలయంలోని గోపురాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి గోపురము పైన అద్భుతమైన వేలాది శిల్పాలు ఉన్నాయి. సంవత్సరాలు తరబడి ఆ శిల్పులు పడిన శ్రమకు సాక్షాలుగా అవి మనకు కనుల ఎదుట కనిపిస్తున్నాయి. అత్యంత విశాలమైన ఆవరణములో పెద్దవిగా చిన్నవిగా ఎన్నో గోపురాలు ఉన్నాయి. పాండ్యులు, చోళులు ఇలా ఎంతోమంది మహారాజుల సేవకు అద్భుతంగా ఉన్న ఆలయము ఈ మధుర మీనాక్షి ఆలయము.
పరమశివుడు 64 లీలలు ఇక్కడ ప్రదర్శించబడడము గొప్ప విశేషము. ఒక ముసలి భక్తురాలి కోసము స్వామి ఇసుక టతను మోసి కొరడా దెబ్బలు తిన్నది కూడా ఈ మధురా నగరములోనే. మోసపోయిన ఒక భక్తురాలి మాటను నిజము చేయడము కోసము వృక్షాన్ని, కొలను సృష్టించింది కూడా ఈ మధుర నగరములోనే. మరో భక్తుడి కోసము స్వామి వారు కట్టెలు కొట్టే వ్యక్తి రూపములో వచ్చింది కూడా ఈ మధురా నగరములోనే. సకల శక్తులు ఉన్న సిద్దుని రూపములో వచ్చి రాతి ఏనుగు చెరుకు గడ్డలను తినేలా చేసింది కూడా ఈ మధుర నగరములోనే. మీనాక్షి దేవికి పరమశివునికి వివాహము జరిపిస్తున్న మహావిష్ణువు, గజలక్ష్మి ఇలా అందమైన అద్భుతమైన చిత్రాలు, శిల్పాలు అంతేకాదు శివ లీలాలను వివరించే చక్కటిదృశ్యాలు కూడా ఉన్నాయి. స్వామి వారు చేసిన 64 లీలలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు, అద్భుతమైన కళ నైపుణ్యాలతో అందంగా రాతితో చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ గోపురాల పైనే కాదు స్తంభాలు, గోడల మీద కూడా శిల్పాలతో చెక్కబడిఉంటుంది.
ఈ ఆలయము లో నటరాజు అయిన పరమేశ్వరుడు కొలువై ఉండడం చేత సకల కళలకు ఈ ఆలయము నిలయమై ఉంది. ఈ ఆలయము లో ఎన్నో బ్రహ్మాండమైన శిల్పాలు అయ్యిన వీరభద్రుడు, కాళికాదేవి, అర్ధనారీశ్వరుడు, ఇలా వేలాది మంది మూర్తులు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు.
విదేశీయుల దండయాత్ర సమయములో మూల విరాట్ విగ్రహము దెబ్బ తినకుండా ఉండటానికి అప్పుడు ఒక పెద్ద గోడను స్వామి వారి ముందు నిర్మించారు. 40 సంవత్సరాల తర్వాత ఆ కట్టిన గోడను కూల్చినప్పుడు లోపల దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. పూల మాలలు వాడిపోకుండా తాజాగా ఉన్నాయని స్థల పురాణం ద్వారా తెలిసింది.
రాజా అలంకరణతో నిలిచి ఉన్న భంగిమలో దర్శనమిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యస్వామి. తల్లితండ్రులతో కొలివైవున్న సుబ్రహ్మణ్యస్వామి కూడా ఉంటారు.
మీనాక్షి దేవి నిలుచున్న భంగిమలో, కుడి చేతిలో చిలుకతో దర్శనమిస్తూ ఉంటారు. కలలకు రాణి అయిన ఈ అమ్మవారు మంత్రిని, కూతంగి అని పిలవబడుతుంది అని చెబుతూ ఉంటారు అర్చకులు. ఒక మహారాణికి ఉండే గంభీరము, దయామయికి ఉండే కారుణ్యము తో ఇక్కడ ఉంటారు మీనాక్షి అమ్మవారు.
ఈ దివ్య దంపతులు కొలువున్న ఈ ఆలయము లో ఎప్పుడు జన సందోహంతో తిరుణాల లాగా ఉంటుంది. భక్తుల సముదాయం ఒకవైపు కితకితలడుతుంటే మరి ఒక పక్క పర్యాటకులుగా వచ్చే విదేశీయులు మరొకవైపు. పాండ్య రాజుల కాలంలో ఈ నగరము ఎంతో సుభిక్షంగా ఉందో అదేవిధంగా ఈనాటికి కూడా అలాగే కొనసాగుతూ ఉంది. అందుకు మీనాక్షి దేవి అనుగ్రహమే ప్రధాన కారణము.
ఇక్కడ మీనాక్షి అమ్మవారి అనుగ్రహము పొందగలిగితే వారు జీవితంలో పొందలేని అంటు ఏమి ఉండదు.