పిస్తా పప్పు లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

పిస్తా పప్పు లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు 


పిస్తా పప్పు అని చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు. చాలామంది పిస్తా పప్పు తింటే డయాబెటిస్ పెరిగిపోతుంది ఏమో అని భయపడుతూ ఉంటారు. కానీ, ఇలాంటి భయాలు ఏమీ లేకుండా తీసుకోగలిగే చక్కటి డ్రై ఫ్రూట్ పిస్తా పప్పు.

పిస్తా పప్పు లో ఉండే పోషక విలువలు

  • 100 గ్రాములు పిస్తా పప్పుని తింటే 560 కిలో క్యాలరీల శక్తి ఇందులో ఉంటుంది.
  • పిస్తా పప్పు లో కార్బోహైడ్రేట్స్ 27 గ్రాములు ఉంటాయి.
  • పిస్తా పప్పు లో మాంసము కృతులు 23 గ్రాములు ఉంటుంది.
  • పిస్తా పప్పు లో కొవ్వు 42 గ్రాములు ఉంటుంది.
  • పిస్తా పప్పు లో పీచు పదార్థాలు 10 గ్రాములు ఉంటాయి.
  • ఇతర సూక్ష్మ పోషకాలైన లూటీన్ 290 మైక్రో గ్రాములు ఉన్నాయి. ఇది కంటికి చాలా మంచిది. కంటి సమస్యలు తగ్గించి కంటి చూపు మెరుగు పరుస్తుంది.
  • సోడియం మరియు పొటాషియం రెండు కలిపి  1050 మిల్లీగ్రాములు ఉంటుంది.
  • ఎముక పుష్టికి కావాల్సిన పాస్పరస్ 537 మిల్లీ గ్రాములు ఉంది.
  • ఇందులో పాలీ ఫినాల్స్ అనేటివి 132 మిల్లి గ్రాములు ఉంటుంది.
  • ఇందులో మెలోతిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల మంచి నిద్ర వస్తుంది.

పిస్తా పప్పును ఎవరు ఎక్కువగా తీసుకోవచ్చు

  • సహజంగా పిస్తా పప్పు అన్ని రకాల ఆమైనో ఆసిడ్స్ ని కలిగి ఉన్న పప్పు పిస్తా పప్పు. అన్ని రకాల ఆమైనో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయి. 
  • ఇందులో పాలిఫినాల్స్ ఎక్కువగా ఉండటం వలన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించి యాంటీ ఆక్సిడెంట్ ని బాగా పెంచుతుంది.
  • రోజుకి 30 గ్రాములు పిస్తా పప్పుల్ని తింటే నాలుగు వారాల నుంచి ఆరు వారాలు తినేసరికి మన శరీరంలోని ఆంటీ ఆక్సిడెంట్ బాగా పెరుగుతాయి. బాడీ నుంచి వచ్చే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
  • కంటి చూపు సమస్య ఉన్నవారు రోజు పిస్తా పప్పుని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. చిన్నపిల్లలకు పిస్తా పప్పుని తినిపించడం వలన ఎప్పటికీ కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చాలామంది డయాబెటిస్ వలన కంటి రెటీనా సరిగా పనిచేయకపోవడము వలన కంటి చూపు సమస్య వచ్చిన వాళ్ళు పిస్తా పప్పు ను తింటే కంటి చూపు సమస్య తగ్గిస్తుంది.
  • డయాబెటిస్ ఉన్నవాళ్లు పిస్తా ఎక్కువగా తింటే డయాబెటిస్ పెరగకోకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు పిస్తా పప్పు తినడం వలన శరీరంలో ఉన్న చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు.
  • పిస్తా పప్పులో ఎలజిన్ అనే అమినో ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆసిడ్ శరీరం లోపలికి వెళ్లి నైట్రిక్ యాసిడ్ గా మారి రక్తనాళాలు వ్యాపింప చేసేటట్లు చేసి బీపీ ని తగ్గించడానికి పిస్తా పప్పులు బాగా ఉపయోగపడుతుంది.
  • ఈ పిస్తా పప్పులో 42 గ్రాములు కొవ్వులు ఉన్నప్పటికీ కూడా మోనో ఆన్సాటురటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి కొవ్వు పదార్థాలు ఉండటం వలన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
  • ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.

ఉప్పుతో ఉన్న పిస్తా పప్పు ను తినడము వలన కలిగే నష్టాలు

ఉప్పుతో ఉన్న పిస్తా పప్పు ను తినడము మంచిది కాదు. ఉప్పుతో ఉన్న పిస్తా ను తినడము వలన బీపీ పెరుగుతుంది. ఉప్పును ఎక్కువ తీసుకోవడము వలన శరీరానికి కూడా మంచిది కాదు.

పిస్తా పప్పుని ఎలా తింటే మంచిది

ఎప్పుడో ఒకసారి తినేటప్పుడు మాత్రము అలాగే పిస్తా పప్పుని తినొచ్చు. రోజు పిస్తా పప్పుని తినేటప్పుడు నానబెట్టిన పిస్తా పప్పుని తింటే మంచిది. రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టిన పిస్తా పప్పుని తినాలి. నానబెట్టిన పిస్తా పప్పుని తినడము వలన తేలికగా అరుగుతుంది. నానబెట్టిన పిస్తా పప్పు రెండు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు తినవచ్చు. నానబెట్టిన పిస్తా పప్పు ను తినడము వలన తేలికగా అరుగుతుంది. చిన్నపిల్లలకి నానబెట్టిన పిస్తా పప్పుని పేస్ట్ లాగా చేసి పాలలో కలిపి ఇవ్వచ్చు. రోజు నానబెట్టిన 20 గ్రాముల పిస్తా పప్పుని తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఫ్యాక్స

1. సాయంత్రం పూట పిస్తా పప్పుని తినవచ్చా?
జ. సాయంత్రం సమయములో పిస్తా పప్పును తినొచ్చు. అయితే పిస్తా పప్పుని తిన్న తర్వాత రాత్రి కి ఆహారము తక్కువ తినడము మంచిది.

2. నిద్ర బాగా పట్టడానికి పిస్తా పప్పుని నిద్రపోయే ముందు తిని పడుకోవచ్చా?
జ. నిద్రపోయే మూడు గంటల ముందు తింటే మంచిగా నిద్ర పడుతుంది.

3. ఉదయం పడికడుపున పిస్తా పప్పుని తినడము మంచిదా లేకపోతే ఉదయం అల్పాహారం చేసిన తర్వాత పిస్తా పప్పుని తీసుకుంటే మంచిదా?
జ. ఉదయం పూట పడికడుపున తింటే మంచిది.

4. నానబెట్టిన పిస్తా పప్పు పేస్ట్ ని పాలల్లో కలిపి పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తాగవచ్చా?
జ. తాగొచ్చు. కానీ, త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సన్నగా ఉన్నవారు తాగచ్చు ఏమీ కాదు. లావుగా ఉన్నవారు పాలలో కాకుండా అలానే తీసుకుంటే మంచిది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!