బ్రూస్ లీ జీవిత రహస్యాలు

బ్రూస్ లీ జీవిత రహస్యాలు



ఐదు అడుగుల 6 అంగుళాల ఎత్తు, 58 కేజీల బరువు, ఉక్కు లాంటి కండలతో కంటికి కూడా కనిపించనంత మెరుపు వేగముతో ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే ఒక్క దెబ్బతో మట్టి కల్పించగల ధీరుడు. కుంఫు, కరాటే వంటి పోరాట విద్యలు నేర్చుకునే వారికి ఈయన ఆరాధ్య దైవము. అతనే మార్షల్ ఆర్ట్స్ వీరుడు "బ్రూస్ లీ". ఆ రోజుల్లో బ్రూస్ లీ ని వోధించే వారే లేరు.

1940 నవంబర్ 27వ తేదీన సాన్ ఫ్రాన్సిస్ లో జన్మించారు బ్రూస్ లీ. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలము తర్వాత ఆయన కుటుంబము అమెరికా నుంచి హాంగ్ కాంగ్ కి వచ్చేసారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు. ఆయన బ్రూస్ లీ ని కూడా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ కి తీసుకొని వెళ్లేవారు. దాంతో బ్రూస్ లీ కి చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా నటనతో పాటు బ్రూస్ లీ డాన్స్ కూడా నేర్చుకున్నారు.

అప్పట్లో హాంగ్ కాంగ్ లో మాఫియా ముఠాలు, గ్యాంగ్ లు పాలించేవారు. అక్కడ బ్రతకడము చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్లీ కి 14 సంవత్సరాల వయస్సు. ఒకసారి బ్రూస్ లీ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్ లీ తో గొడవ పడి బ్రూస్ లీ ని కొట్టారు. ఆ సంఘటననే బ్రూస్ లీ ని మార్షల్ నేర్చుకునే లాగా చేసింది. తనని తాను రక్షించుకోవడము కోసము బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవాలని అనుకున్నారు. అప్పట్లో కుంఫులో నెంబర్ వన్ అయినటువంటి హిప్ మాన్ అనే ఆయన దగ్గర బ్రూస్ లీ కుంఫు నేర్చుకున్నారు. స్కూల్లో మరొకసారి ఆ గ్యాంగ్ బ్రూస్ లీ మీద దాడికి దిగారు. కానీ, బ్రూస్ లీ ఇంతకుముందు లాగా కాకుండా ఈసారి గొడవలో ఒకడి పళ్ళు ఊడిపోయేలాగా, మరియొక్క వ్యక్తికి చెయ్యి విరిగిపోయేలాగా బ్రూస్ లీ వాళ్ళని చితక్కొట్టారు. దీంతో ఇంకొకసారి బ్రూస్ లీ తో గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీసులు బ్రూస్ లీ తండ్రిని బెదిరించారు. అయితే ఈ మాఫియా గ్యాంగుల నుంచి దూరంగా ఉంచడం కోసము బ్రూస్ లీ తల్లిదండ్రులు 18 సంవత్సరాల వయసున్న బ్రూస్ లీ ని క్యాలిఫోర్నియాలోని తన స్నేహితుల ఇంటికి పంపించారు. మళ్లీ పుట్టిన చోటికి వచ్చారు బ్రూస్ లీ.

బ్రూస్ లీ ప్రారంభించిన జూన్ ఫ్యాన్ గుంగ్ ఫూ ఇన్స్టిట్యూట్

బ్రూస్ లీ మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేశారు. కొంతకాలము తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో ఫిలాసఫీ కోర్సులో చేరారు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా శిక్షణ తీసుకునేవారు. ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్ లీ క్రేజ్ పెరిగిపోయింది. ఎంతోమంది స్నేహితులు బ్రూస్ లీ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే "జూన్ ఫ్యాన్ గుంగ్ ఫూ" అనే మార్షల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారు.

బ్రూస్లీ వివాహము

జూన్ ఫ్యాన్ గుంగ్ ఫూ ప్రారంభించిన కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితురాలు అయినటువంటి లిండా ఎమెరీ లీ కాడ్వెల్ అనే అమ్మాయిని ప్రేమించి 1964లో ఆమెని వివాహము చేసుకున్నారు.

కొద్ది రోజుల్లోనే బ్రూస్లీ అమెరికాలో రెండవ స్కూల్ ని కూడా ప్రారంభించారు. అయితే బ్రూస్లీ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన మార్షల్ ఆర్ట్స్ రహస్యాలను ఇతర దేశాల వారికి నేర్పుతున్నారని కోపంతో కొంతమంది బ్రూస్ లీ కి అడ్డు తగిలేవారు. చంపేస్తామని భయపెట్టే వారు. అయినా బ్రూస్లీ ఎవరికీ భయపడలేదు. బ్రూస్ లీ తనకు తెలిసిన కరాటే, కుంఫు, బాక్సింగ్ వీటన్నిటినీ కలిపి జీత్ కునే డో అనే ఒక కొత్త రకమైన మార్షల్ ఆర్ట్స్ ని కనిపెట్టారు.

ఒకసారి హెడ్ పార్కర్ కరాటే ఛాంపియన్ పోటీలో బ్రూస్లీ ఇచ్చిన వన్ ఇంచ్ పంచ్ అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. దాంతో బ్రూస్ లీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బ్రూస్ లీ ఒక అంగుళం నుంచి పంచ్ ఇస్తే ఒక మనిషి 5 నుంచి 6 మీటర్ల దూరంలో పడేవారు. అంతేకాదు, చాప్ స్టిక్స్ ని ఉపయోగించి గాలిలోకి విసిరేసిన బియ్యపు గింజని పట్టుకోగలరు. మీ చేతిలో ఒక కాయిన్ ని ఉంచుకొని మీ చేతిని మూసే లోపు నీ చేతి నుంచి ఆ  కాయిన్ ని బ్రూస్ లీ  తీసుకోగలరు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఒక మనిషి చెయ్యలేదు అని అనుకునే ఎన్నిటినో బ్రూస్ లీ చేసి చూపించారు.

1965 లో బ్రూస్ లీ కి ఒక కొడుకు జన్మించారు. తన పేరు బ్రాండన్ లీ. అయితే బాబు పుట్టిన ఒక వారములోనే బ్రూస్లీ తండ్రి గారు చనిపోయారు. కొంతకాలం తర్వాత బ్రూస్ లీ కి ది గ్రీన్ హార్నెట్, బ్యాట్ మాన్ వంటి సో సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ షో ల తర్వాత చాలామంది హీరోలకి మార్షల్ ఆర్ట్స్ కోర్సుగా చేరారు.

1970లో ఒకసారి బరువు ఎత్తుతుండగా బ్రూస్ లీ వెన్నపూస బాగా దెబ్బతినింది. దాంతో డాక్టర్లు బ్రూస్లీ మళ్లీ మార్షల్ ఆర్ట్స్ చెయ్యలేరు అని నిర్ధారించారు. వాళ్లు చెప్పింది తప్పు అని నిరూపిస్తూ కొన్ని రోజుల్లోనే మళ్లీ బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ లోకి వచ్చారు.

బ్రూస్ లీ ఒక రోజుకి 2000 పంచ్ లు, 1000 కిక్కులు, ఐదు కిలోమీటర్ల పరుగు ఇలా మార్షల్ ఆర్ట్స్ ని విపరీతంగా చేసేవారు. అంతేకాదు తన కొడుకు బ్రాండన్ లీ కి కూడా చిన్న వయసులో నుంచి మార్షల్ ఆర్ట్స్ ని నేర్పించారు. కొంత కాలానికి బ్రూస్లీ కి కూతురు కూడా పుట్టింది. తర్వాత బ్రూస్ లీ హాంగ్ కాంగ్ కి వెళ్ళిపోయారు.

బ్రూస్ లీ నటించిన సినిమాలు

  • బ్రూస్ లీ కి హాంగ్ కాంగ్  లో రేమండ్ చౌ అనే ఒక నిర్మాత తో పరిచయము ఏర్పడింది. అతనితో కలిసి తీసిన ది బిగ్ బాస్ అనే సినిమా ఆసియాలో ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. బ్రూస్ లీ సినిమాలో చేసే ఫైట్లు కెమెరాలో కనిపించనంత వేగంగా ఉండేటివి. అందుకోసము ఆ సీన్లను స్లో మోషన్ లో చేసి చూపించేవారు. ది బిగ్ బాస్ హిట్టుతో బ్రూస్ లీ ఇంటర్నేషనల్ స్టార్ గా మారారు. అలా తనకు వచ్చిన అభిమానులతో సంతృప్తితో మరింత కష్టపడ్డారు.
  • తర్వాత తీసిన ఫిస్ట్ అఫ్ ఫ్యూరీ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా అంతకుముందు ఏ సినిమాలో చూడని నాన్ జాక్ అనే కొత్త ఆయుధాన్ని చూపించారు బ్రూస్ లీ. మళ్లీ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప యాక్షన్ హీరోగా మారారు బ్రూస్ లీ.
  • బ్రూస్ లీ తీసిన వే ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాకి బ్రూస్ లీ రైటర్, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్, హీరో, ఫైట్ మాస్టర్, డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
  • తర్వాత వార్నర్ బ్రదర్స్ తో కలిసి ఎంటర్ ద డ్రాగన్ అనే సినిమాని తీశారు.

బ్రూస్ లీ మరణము

బ్రూస్ లీ తన గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా గురించి ఆ సినిమాలోని హీరోయిన్ అయినా బెట్ డిటింగ్ ఇంట్లో సినిమా గురించి చర్చిస్తుండగా బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. దాంతో బెట్ డిటింగ్ బ్రూస్ లీ కి ఆక్వాజెసిక్ అనే టాబ్లెట్ ని ఇచ్చింది. ఆ టాబ్లెట్ వేసుకొని బ్రూస్ లీ ఒక గదిలోకి వెళ్లి నిద్రపోయారు. బ్రూస్ లీ ఎంతసేపటికి నిద్రలేవకపోవడంతో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. కానీ లాభము లేదు. 1973 జులై 20వ తేదీన తనకి 32 ఏళ్ల వయసులో బ్రూస్ లీ కన్నుమూశారు. ప్రపంచమంతా కుదిపేసిన వార్త ఇది. ఈయన ఎంతో కష్టపడి తీసిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక వారం ముందుగానే బ్రూస్లీ మరణించారు.

బ్రూస్ లీ అంతక్రియలు జరుగుతున్న సమయంలో హాంగ్ కాంగ్ రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కొన్ని వేల మంది జనము ఆయన అంత్యక్రియలలో పాల్గొన్నారు.

బ్రూస్ లీ మరణానికి కారణము

బ్రూస్ లీ చనిపోవడానికి కారణము సెరిబ్రల్ ఎడిమా అంటే తలనొప్పి తగ్గడానికి ఆయన వేసుకున్న ఆక్వాజెసిక్ టాబ్లెట్ వికటించడంతో మెదడులో నీరు చేరి మెదడు వాపుకు గురి అవ్వడంతో ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అయితే బ్రూస్ లీ మరణం వెనకాల ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బ్రూస్ లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగ్లు కానీ చైనా మార్షల్ ఆర్ట్స్ రహస్యాలను ప్రపంచము అంతట చెప్పారని కోపంతో కొంతమంది కానీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కానీ చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరును సంపాదించుకున్నారు అని అసూయతో సినిమా పరిశ్రమలోనే కొంతమంది మాఫియా తో చేతులు కలిపి బ్రూస్ లీ ని చంపించి ఉంటారని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ బ్రూస్ లీ మరణానికి మాత్రము సెరిబ్రల్ ఎడిమా నే కారణము అని సైంటిఫిక్ మెడికల్ లో తేలింది.

బ్రూస్ లీ కేవలం ఫైటర్ మాత్రమే కాదు. గొప్ప ఫిలాసఫర్ కూడా. తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలను కలిపిన మొట్టమొదటి హీరో బ్రూస్ లీ. ఇన్ని సంవత్సరాలు గడిచిన మళ్లీ ఇలాంటి వీరుడు, నటుడు రాలేదు. బ్రూస్ లీ మరణము ఒక మిస్టరీ నే కావచ్చు. కానీ, బ్రూస్ లీ జీవితము మాత్రము ఎప్పటికీ చెరిగిపోని ఒక హిస్టరీ. ఇప్పట్లో బ్రూస్ లీ ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది యువకులు కరాటే, కుంఫు వంటివి నేర్చుకుంటున్నారు.

ఇంత చిన్న వయసులోనే ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకొని బ్రూస్ లీ జీవితము మనందరికీ ఒక ఆదర్శము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!