చెడు ఆహార పదార్థాలను మన శరీరములోనికి వెళ్లకొకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలు
మన మనసు మన చెక్కు చేతుల్లో ఉంటే జీవితము చాలా బాగుంటుంది. మన మనసు చేతులో నుంచి తప్పితే జీవితము చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ మనస్సును నియంత్రించడం కష్టముగా అనిపిస్తుంది చాలామందికి. మరి మనసుని నియంత్రించే విషయంలో ఎక్కువ మంది ఉపయోగించే పదాలు "నా మనసు చాలా సున్నితము, అస్సలు నా మటా నా మనసు వినడు, ఏది వద్దనుకున్నా మనసు దాని మీదకే లాగిస్తూ ఉంటుంది, నేను అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను, కంట్రోల్ చేసుకోవడము నావల్ల అవ్వడము లేడు" అని అంటూ ఉంటారు. ఇలా బలహీనమైన మనసుని శక్తివంతంగా చేసుకోవాలి అంటే మందులు ఉండవు, ఎవ్వరు సహాయము చేయటానికి ఉండదు, మీకు మీరు సహాయము చేసుకోవాలి, మీ మనసుతో మీరు మాట్లాడుకుంటూ నీ మనసుని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఆ పవర్ ని మీరే పెంచుకోవాలి. మరి ఈ బలహీనమైన మనసుని శక్తివంతంగా చేసుకోవడానికి ఒక ఉపాయము ఉంది.
నేను చాలా వాటిని వదిలేసి ఎప్పుడు కంట్రోల్ గా ఉంటాను. ఏది కనిపించినా సరే దాని మీద ఆకర్షణ వెల్లకోకుండా మనసుని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
మీరు ఆరోగ్యానికి హాని కలిగించేవి, మానసిక స్థితికి, ఆనందానికి, అవరోధాలు కలిగించేవి, కొన్ని బలహీనతలకు వీటిని కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిటిని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మన మనసు అనుకున్న రోజు నుంచి వదిలేసిన దాని వైపు వెళ్లకుండా ఉండాలి. కొంతమంది మద్యం సేవిస్తూ ఉంటారు. వీరు మనసులో "ఈ మధ్యపానాన్ని ముట్టుకోకూడదు" అని అనుకోవాలి. కొందరు స్త్రీ లు కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు. ఇలాంటివారు " నేను ఇకపై కాఫీ, టీ లు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి చెడు" అని అనుకోవాలి. ఇలాంటివి ఒక వ్యసనాలు ఇవి మన జీవితాలను పాడు చేస్తాయి. ఇలాంటి వ్యసనాలు నన్ను వెంటాడకూడదు అంటూ మనసులో పదేపదే అనుకోవాలి. అలాగే కొన్ని హాని కలిగించే ఆహార పదార్థాలు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటి వాటిని "నేను తినకూడదు" అని అనుకోవాలి.
ఇలాంటి అన్నిటి నుంచి బయట పడాలి అంటే ఒక సంకల్పము చేయాలి. ఈ రోజు నుంచి అలాంటి వాటిని ముట్టుకోను అని మనసులో పెట్టుకోవాలి. ఇది నాకు ఈ రోజుతో అయిపోయింది. వీటితో నాకు ఎలాంటి సంబంధము లేదు అని అనుకోండి. ఇలా ఈ సంకల్పము రోజుకు ఒక ఐదు నుంచి పది సార్లు వరకు చేయండి. నేను ఇప్పటివరకు వాటిని అనుభవించాను, ఇప్పుడు వీటిని వద్దనుకుంటున్నాను అని మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోండి.
నేను చెప్పినట్టు నా మనసు వినాలి. మనసు చెప్పినట్లు నేను వినడము కాదు, నేను చెప్పినట్టు నా మనసు వినాలి. నా ఆధీనము లో నా మనసు ఉండాలి కాబట్టి ఇలాంటి వాటి జోలికి నేను ఈ రోజు నుంచి వెళ్లకూడదు అని మీ మనసులో వీటికి పుల్ స్టాప్ పెట్టాలి. ఇలా అనుకోవడము వలన మన మనసు దానిమీద పనిచేస్తూ ఉంటుంది. రోజు ఇలాంటి వాటి గురించి ఐదు నుంచి పది సార్లు వరకు సంకల్పము చేస్తూ ఉండండి. నేను వీటికి పుల్ స్టాప్ పెట్టాను అని తలచుకుంటూ ఉండండి. దీనివలన వెళ్లొద్దు అనే ప్రేరణ మీకు కలుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు సిగరెట్, ఆల్కహాల్, టీ, కాఫీ ఇలాంటి హాని కలిగించే లేదా బరువు పెంచే హార్మోన్స్ ఎఫెక్ట్ చేసే చెడు ఆహారము అలాంటి వాటిని మనసులోకి లోపలికి చేసుకోవాలంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది. వీటన్నిటికీ నేను దూరంగా ఉంటే హాయిగా ఉంటాను. నేను ఆనందంగా ఉండాలి. నా జీవితము అంతా కూడా ఎటువంటి వాడిదుడుకులు లేకుండా ఉండాలి. అవన్నీ రుచిని, కాసేపు క్షణిక ఆనందాన్ని ఇస్తాయి కానీ ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేయవు. ఇవి ఆరోగ్యాన్ని నాశనము చేస్తాయి. అందుకని అవన్నీ నాకు వద్దు. మనసుకి దుఃఖాన్ని ఇచ్చేవి నాకు వద్దు. అని ఇలా మనసులో పెట్టుకుంటే ఈ సమాజము లో తిరుగుతూ అందరిలో ఉంటూ అన్ని చూస్తున్న ఏమాత్రము కోరిక కలగకుండా నిగ్రహించుకుని ఉండడము చాలా సులభము. అంటే మనము బలవంతంగా ఆపుకోవడము లేదు ఇష్టంగానే ఆపుకోవాలి.
ఇలా చేయడము వలన శరీరము మొత్తము నాచురల్ గా ఉంటూ ఏవైనా మానసిక సమస్యలు తగ్గుతాయి. ఇలా అనుకుంటూ ఉంటే మీరు ఎంతో సులభంగా కంట్రోల్ చేసుకోగలుగుతారో అప్పుడు మీకు కొన్ని ఇలాంటి విషయాలలో సక్సెస్ అయితే ఇంకొన్నిటిని మీరు సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఎవ్వరైనా సరే మన జీవితాన్ని మంచిగా ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, సుఖశాంతులతో ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటే మన మనసు మన చెక్కు చేతుల్లోకి తెచ్చుకోవాలి. మన మనసు ఆధీనంలోకి మనము వెళ్ళకూడదు మన ఆదినంలోకి మన మనసు రావాలి.
నీళ్ల మీద పడవ ఉండడము క్షేమము మరి పడవ మీద నీరు ఉండటము క్షేమం కాదు. అందుకని మన ఆధీనంలో మన మనసు ఉండాలి.
వీటిని మీ జీవితము లో అనువదించుకోండి. మనమందరము ఆశించిన విధముగా సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్లడానికి మంచి అవకాశము కలుగుతుందని అనుకోండి. ఇలా చేయడము వలన ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభవించవచ్చు. మన మనసులోనే ఆనందము ఉంది. ఈ మనసుతోనే అన్నీ ఉన్నాయి. అందుకని దీనిని మనము కంట్రోల్ చేసుకోగలిగితే అందరూ ఆశించిన విధంగా జీవితాన్ని సార్ధకము చేసుకోవచ్చు.