ఆరోగ్యంగా ఉండాలా అంతే.. ఈ యాంటీ ఆక్సిడెంట్లు తప్పనిసరిగా తీసుకోండి...
యాంటీ ఆక్సిడెంట్ అనే పదాన్ని మనము బాగా కరోనా సమయములో విన్నడము జరిగింది. అంతకుముందు బాగా చదువుకున్న వారికి డాక్టర్లకి మాత్రమే తెలిసింది. మన శరీరాని రక్షించే యాంటీ ఆక్సిడెంట్ ఈ రోజుల్లో తక్కువ మొత్తాడులో శరీరము లోపలికి వెళ్తున్నాయి. అదే ఎక్కువ మొత్తంలో వెళ్తే మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము.
యాంటీ ఆక్సిడెంట్స్ ఏమిటంటే
మన శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్ అని అంటారు. మనకు దెబ్బలు, గాయాలు అయినప్పుడు తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సహాయపడుతాయి. మనలో కెమికల్స్, విష పదార్థాలు, టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ లాంటి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అయినప్పుడు వాటన్నిటినీ నిర్మూలించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్ అని అంటారు.
యాంటీ ఆక్సిడెంట్ ఎందులో ఉంటాయి
యాంటీ ఆక్సిడెంట్ అంటే సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలలో చాలా రకాలు ఉంటాయి. కానీ, యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా రక్షణ కలిగించేవి కొన్ని ముఖ్యంగా చెప్పబడుతాయి. అవి విటమిన్ - సి, విటమిన్ - ఏ, విటమిన్ - ఈ, సెలీనియం, జింక్ ఇలాంటి వాటిని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఇలాంటి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభించే ఆహారంలో కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ అన్ని ఆహార పదార్థాలలో ఉంటాయి. కానీ అన్నిట్లో ఉన్నప్పటికీ మన శరీరము లోపలికి ఎందుకు ఇవి తక్కువగా వెళ్తున్నాయి అంటే మనము రుచికోసము, అభిరుచుల కోసము ఈ ఆహార పదార్థాలను తొక్క తీసే విధానము, వండే విధానములో, నిలువ ఉంచే విధానములో ఈ యాంటీ ఆక్సిడెంట్ నశిస్తున్నాయి. ఇలా ఎలా పడితే అలా చేసుకొని తినడము వలన ఆహార పదార్థాలు మన నోటిలోకి వెళ్లేసరికి ఆహారములోని యాంటీ ఆక్సిడెంట్ పోతున్నాయి. అందుకని వేడి చేసినప్పుడు, వేపినప్పుడు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి. ఒక మాదిరిగా వేడి చేసినప్పుడు కొద్దిగా తగ్గుతాయి. కాబట్టి మనము రోజు నాలుగు సార్లు తింటున్నాము. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఈ నాలుగు పూటలా వండినవే తింటున్నాము. రోగాలు రావటానికి రోజుకు నాలుగు సార్లు వండింది తింటున్నాము. వయసు రాకుండానే ముసలితనానికి గురి అవ్వడము కూడా వండినవి తినడమే కారణము. శరీరము లో ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి లోపల కెమికల్స్, ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి క్యాన్సర్, దీర్ఘ రోగాలు రావడము జరుగుతుంది. దీర్ఘ రోగాలు రావడానికి కారణము నాలుగు పూటలా వండినవి తినడము. ఇలా నాలుగు పూటలా వండినావి తినడము వలన యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తున్నాయి.
అంతేకాకుండా ఉప్పు, నూనె ఎక్కువ మోతాదులో శరీరము లోపలికి పోవటము వలన కూడా యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి.
ప్రకృతి ఇచ్చిన ఆహారములు చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇన్నాళ్లు తినాల్సిన రకాలు అన్ని తినేసాము. నాలుగు పూటలా ఎన్నో రకాల వెరైటీ ఆహారము తీసుకున్నాము అని అనుకోని మంచి ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి.
ప్రతిరోజు 60 నుండి 70 శాతం వరకు పొయ్యి మీద తయారు చేయనివి, ప్రకృతి తయారుచేసిన వాటిని తింటే మంచి ఆంటీ యాక్సిడెంట్స్ వస్తాయి.
యాంటీ ఆక్సిన్స్ రావడానికి ఏ సమయములో ఎలాంటి ఆహారము తీసుకోవాలి
- ఉదయాన్నే కాఫీ, టీ లు మానేసి రోజు ఒక్క కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ ని తాగండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ ని తాగచ్చు. ఈ జ్యూస్ త్రాగడము వలన షుగర్ ఉన్న వారికి ఏమీ పెరగదు. ఈ జ్యూస్ తాగిన ఒక గంట తర్వాత మొలకలు, పండ్లు పెట్టుకుని తినండి.
- మధ్యాహ్నము సమయము లో ఉడికిన ఆహారము తినండి.
- సాయంత్రము 4 గంటలకి పండ్ల జ్యూస్, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము ఇందులో ఏదో ఒకటి త్రాగండి.
- సాయంత్రం 6 గంటలకి నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినేసి కొన్ని పండ్లు తినండి.
ఉదయం 35% ఆరోగ్యకరమైన ఆహారము, సాయంత్రము 35% ఆరోగ్యకరమైన ఆహారము. మొత్తం కలిపి 70% ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోండి. రోజు 70% ఆరోగ్యకరమైన ఆహారము తింటే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.
70% ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవడము వలన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి. ఏమైనా దీర్ఘకాలిక రోగాలు వచ్చినా కూడా తొందరగా కోలుకునేటట్లు చేస్తుంది. చిన్నవయసులోనే ముసలితనానికి గురి కాకుండా చేస్తుంది.
ఫ్యాక్స
1. ఉదయాన్నే ఎలాంటి కూరగాయలతో తయారుచేసిన జ్యూస్ ని తీసుకోవాలి?
జ. బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, కీర, టమోటా ఇలాంటి కూరగాయలతో రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ చేసుకుని ఉదయానే త్రాగడము మంచిది.
2. మధ్యాహ్నము సమయములో ఎలాంటి ఆహారము తీసుకోవడము వలన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా దొరుకుతాయి?
జ. మధ్యాహ్నము పూట మీకు నచ్చిన ఆహారాన్ని తినడము వలన ఏమీ కాదు. రోజు మధ్యాహ్నము పూట మనకు నచ్చింది తింటూ ఉదయము, సాయంత్రము పైన చెప్పిన విధానాన్ని పాటించడము వలన మంచి యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోనికి వెళ్తాయి.
3. సాయంత్రము సమయము లో ఎలాంటి జ్యూసులు తాగితే త్వరగా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి?
జ. కొబ్బరి నీళ్లు, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, కమలాపండు, చెరుకు రసము ఇలాంటి జ్యూస్ త్రాగితే త్వరగా మంచి యాంటీ ఆక్సిడెంట్ వస్తాయి.
4. పైన చెప్పిన విధానాన్ని ఎన్ని రోజులు పాటిస్తే మంచిది?
జ. ఇది నెల లేదా రెండు నెలలు చేసి మానేసిది కాదు. ఇలా ఎప్పటికీ చేస్తూ ఉంటే శరీరములోకి మంచి ఆంటీ ఆక్సిడెంట్ వచ్చి ఏలాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటారు.