జాక్ మా జీవిత చరిత్ర మరియు వాస్తవాలు....
గత 50 సంవత్సరాలలో ప్రముఖ ఫోర్బస్ మాక్సిన్ కవర్ మీద కనిపించిన మొట్టమొదటి చైనీయుడు జాక్ మా. ఒకప్పుడు ఉద్యోగము లేక బాధపడ్డారు. ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు జాక్ మా గారు.
జాక్ మా యొక్క బాల్యము
జాక్ మా గారు చైనాలోని హాంగ్జౌ అనే నగరములో ఒక పేదరిక కుటుంబములో జన్మించారు. జాక్ మా కి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టము. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉండేది. కానీ, అప్పట్లో చైనాలో ఇంగ్లీష్ ని ఎవరు మాట్లాడేవారు కాదు. ఆ రోజుల్లో చైనా కి అమెరికా, ఇంగ్లాండ్ వంటి పశ్చిమ దేశాలతో ఎటువంటి సంబంధాలు ఉండేవి కాదు. కానీ, ఒకసారి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్ సన్ గారు జాక్ మా ఉండే హాంగ్జౌ నగరాన్ని పర్యటించి, తనకు ఆ ప్రదేశము బాగా నచ్చిందని చెప్పారు. అప్పుడు ఒక్కసారిగా ఆ నగరము ఒక టూరిజముగా మారిపోయింది. దాంతో ఎంతో మంది విదేశీయులు ఆ నగరాన్ని పర్యటించడము మొదలుపెట్టారు. జాక్ మా కు ఇదే సరైన సమయము అనిపించింది. జాక్ మా పొద్దున్నే ఐదు గంటలకు నిద్రలేచి విదేశీయులు ఉంటున్న హోటల్ కి 45 నిమిషాల పాటు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్లకి టూరిస్ట్ గైడ్ గా పని చేసేవారు. అలా 9 సంవత్సరాల పాటు ఫ్రీ గైడ్ గా పని చేశారు.
జాక్ మా చదువు
స్కూల్లో చదువు పూర్తి అయిన తర్వాత కాలేజీకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే రెండు సార్లు ఫెయిల్ అయిపోయారు. చివరికి ఎలాగోలా కాలేజీ చదువు పూర్తి చేశారు. హార్డ్వార్డ్ యూనివర్సిటీలో చదువుకోడానికి అప్లై చేస్తే, ఆ యూనివర్సిటీ పది సార్లు జాక్ మా అప్లికేషన్ ని తొలగించింది. ఇక చేసేది లేక చైనాలోని ఒక యూనివర్సిటీలో ఇంగ్లీషులో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
జాక్ మా ఉద్యోగము కోసము పడ్డ కష్టాలు
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఉద్యోగలకు అప్లై చేశారు. ఎవరు కూడా జాక్ మా కి ఉద్యోగము ఇవ్వలేదు. పోలీస్ ఉద్యోగము కోసము అప్లై చేసే ఐదుగురిలో నలుగురికి ఉద్యోగము వచ్చింది. జాక్ మా సన్నగా ఉన్నారని పోలీస్ ఉద్యోగము ఇవ్వలేదు. కెఎఫ్‌సీ కంపెనీ చైనాలోకి వస్తున్నప్పుడు 24 మంది ఉద్యోగము కోసం అప్లై చేస్తే, 23 మందికి ఉద్యోగము ఇచ్చారు. కానీ, ఒక జాక్ మా కి మాత్రము ఉద్యోగము ఇవ్వలేదు. దాంతో చైనాలోని ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్ టీచర్ గా చేరారు జాక్ మా గారు. అప్పుడు జాక్ మా జీతము నెలకు 12 డాలర్లు.
జాక్ మా ప్రారంభించిన చైనా పేజెస్
టీచర్ గా పని చేస్తున్న సమయములో తనకి ఇంగ్లీష్ బాగా రావడముతో ఒక ట్రాన్సలేషన్ కంపెనీని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒకసారి 1995లో జాక్ మా అమెరికాకు వెళ్లారు. అక్కడ మొట్టమొదటిసారిగా కంప్యూటర్, ఇంటర్నెట్ ని చూశారు. ఏ సమాచారము వెతికిన ఇంటర్నెట్లో వెంటనే రావడము చూసిన జాక్ మా ఆశ్చర్యపోయారు. అప్పుడు మొదటిసారిగా జాక్ మా బీర్ అనే పదాన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూశారు. అన్ని దేశాలకు సంబంధించిన బీర్లు వచ్చాయి. కానీ, చైనాకు సంబంధించి ఎటువంటి సమాచారము రాలేదు. అప్పుడు జాక్ మా వెంటనే చైనాకు సంబంధించి ఒక వెబ్సైట్ ని ప్రారంభించాలి అని అనుకున్నారు. దాని కోసము 3000 డాలర్లు అవసరమై బ్యాంకు చుట్టూ అప్పు కోసము తిరిగారు. బ్యాంకు వాళ్లు మూడు నెలలు తిప్పించుకున్న తర్వాత అప్పు ఇవ్వడము కుదరదు అని చెప్పారు. డబ్బు కోసము దాదాపు 40 మంది వెంచర్ యాప్ లిస్టులను కలిశారు. ప్రతి ఒక్కరూ ఇవ్వము అని చెప్పారు. చివరికి బంధువుల దగ్గర కొంత అప్పు చేసి చైనాలోనే ఫస్ట్ ఇంటర్నెట్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు "చైనా పేజెస్". చైనా కి సంబంధించిన ఏ సమాచారము కావాలన్నా దానిలో లభించే లాగా ఏర్పాటు చేశారు. కానీ, ఆ రోజుల్లో చైనా ప్రజలకి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలీదు. ఎవరి దగ్గర కంప్యూటర్లు ఉండేవి కాదు. కొంత కాలానికి అప్పుగా తీసుకున్న డబ్బు కాస్త అయిపోవడంతో చేసేది లేక ఎంతోకొంత కష్టపడి నిర్మించిన వెబ్ సైట్ ని మధ్యలోనే ఆపేశారు.
జాక్ మా ప్రారంభించిన ఆలీబాబా
తన మొదటి ప్రయత్నము విఫలము అయిన తర్వాత జాక్ మా కి మినిస్టరీ ఫారిన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగము వచ్చింది. కానీ, 1999లో ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన 17 మంది స్నేహితులతో కలిసి తన ఇంట్లో ఆలీబాబా అనే కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా చైనాలోని చిన్నచిన్న వ్యాపారస్తులు ప్రపంచవ్యాప్తంగా తమ వస్తువులను అమ్ముకోవచ్చు. కానీ, ఆలీబాబా ను ప్రారంభించినప్పుడు కొన్ని పత్రికలలో "ఆలీబాబా అనేది ఒక పిచ్చి ఆలోచన, దానికి లాభాలు రావడం కష్టము, ఆ కంపెనీ ఎంతో కాలం ఉండడు" అని ప్రచూరించాయి. అప్పట్లో జాక్ మా ని అందరూ క్రేజీ జాక్ అని పిలిచేవారు.
ఆలీబాబా ప్రారంభించిన కొన్ని రోజులకే డాట్ కామ్ బబుల్ అనేది ఏర్పడింది. దాంతో ఇంటర్నెట్ కంపెనీలన్నీ ఆలీబాబా తో సహా నష్టాల్లోకి పోయాయి. కొన్ని కంపెనీలు అయితే పూర్తిగా మూత పడిపోయాయి. ఆలీబాబా ప్రారంభించిన మొదటి మూడు సంవత్సరాలలో ఒక డాలర్ కూడా లాభము సంపాదించలేదు. ఒకానొక సమయములో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. సరిగ్గా అదే సమయములో గోల్డ్ మాన్ సచేస్ మరియు సాఫ్ట్ బ్యాంక్ అనే కంపెనీలు 25 మిలియన్ల డాలర్లను ఆలీబాబా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. దాంతో ఆలీబాబాకి కొంత సహాయము లభించింది. దీనితో పాటుగా ఆలీబాబా టీమ్ మరియొక్కపక్క టావోబావో అని ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్ ని ప్రారంభించారు. కానీ, అప్పటికే ఆన్లైన్ మార్కెటింగ్ అంతా ఈబెయ్ చేతిలో ఉండేది. ఈ టావోబావో అనే చిన్న కంపెనీ అప్పటికి 150 దేశాలలో విస్తరించిన అతి పెద్ద ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఈబెయ్ తో పోటీ పడవలసి వచ్చింది. అప్పట్లో ఈబెయ్ తో పోటీ పడడము అంటే చాలా కష్టము. ఇంటర్నెట్ బబుల్ వచ్చి అన్ని కంపెనీలు నష్టపోతే ఒక ఈబెయ్ కంపెనీ ఒక్కటి లాభాల్లోకి వెళ్ళింది. అంటే ఈబెయ్ కంపెనీ ఎంత పవర్ఫుల్ లో అర్థమవుతుంది. కానీ, జాక్ మా భయపడలేదు. ఈబెయ్, టావోబావో కి ఒక రకమైన యుద్ధమే జరిగింది. ఈబెయ్ కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తుంటే జాక్ మా మాత్రము టావోబావో సర్వీసులన్నీ మూడు సంవత్సరాల పాటు ఉచితంగా వాడుకునే అవకాశము కల్పించారు. దాంతో టావోబావో వాటా మెల్ల మెల్లగా పెరుగుతూ వచ్చింది. చివరికి ఈబెయ్ తన మార్కెట్ ని కోల్పోయింది. చైనాలో ఈబెయ్ పూర్తిగా మాయమై అయిపోయింది.
ఒకప్పుడు ఆలీబాబా లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ, 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టినప్పుడు ఏకంగా ఒక్క రోజులోనే 25 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది ఆలీబాబా కంపెనీ. దాంతో ఆ ఒక్క రోజులోనే జాక్ మా చైనాలోనే అత్యంత ధనవంతునిగా మారిపోయారు.
జాక్ మా ప్రారంభించిన అలీపే కంపెనీ
ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి అలీపే అనే కంపెనీని ప్రారంభిస్తానని జాక్ మా చెప్పినప్పుడు చాలామంది దీనిని ఎవరు వాడారు అని చెప్పారు. కానీ జాక్ మా ఎవరి మాటలు వినకుండా ఆలీపేని ప్రారంభించారు. ఇప్పుడు ఆలీపేని దాదాపు 100 కోట్ల మంది ప్రజలు వాడుతున్నారు.
ఆలీబాబా గ్రూపులో ఉన్న కంపెనీలు
మనకు ఆండ్రాయిడ్ లాగా చైనాలో ఆలియన్ ఓ ఎస్, మనకు వాట్సప్ లాగా చైనాలో లైవాంగ్, మనకు గూగుల్ ప్లే స్టోర్ లాగా చైనాలో అలియున్, మనకు గూగుల్ మ్యాప్స్ లాగా చైనాలో ఆటో నేవీ, మనకు యూట్యూబ్ లాగా చైనాలో యుకు టుడో, మనకు ట్విట్టర్ లాగా చైనాలో వైయిబో, మనకి అమెజాన్ లాగా చైనాలో టీమాల్, ఆలీబాబా క్లౌడ్ సర్వీసెస్ ఇలా చెప్పాలంటే మొత్తము చైనా వ్యాపారమంతా ఆలీబాబా గ్రూప్ తో ముడిపడి ఉంది.
జాక్ మా చేస్తున్న సేవా కార్యక్రమాలు
వ్యాపార పరంగానే కాకుండా సేవలోను జాక్ మా చైనాలో ముందున్నారు. 2013 వ సంవత్సరములో సీఈఓ పదవి నుంచి తనకు తానుగా తప్పుకొని కొంత సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నారు జాక్ మా గారు. ఇప్పటికే చైనాలోని పర్యావరణము, హాస్పిటల్స్ కోసము కొన్ని మిలియన్ల డాలర్లను దానము చేశారు. ఏకంగా 19 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసియాలోనే అతిపెద్ద హెల్పింగ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు అందరికీ చైనా అంటే ముందు జాక్ మా గుర్తుకొస్తున్నారు.
అసలు చైనా ను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చింది జాక్ మా గారే. ఒకప్పుడు చిన్న ఇంట్లో మొదలైన ఆలీబాబా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఎనిమిదో స్థానంలో ఉంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనే యువకులకు జాక్ మా చెప్పే సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఉద్యోగము కోసము చేసిన ప్రయత్నాలలో విఫలము అయ్యారు జాక్ మా గారు. అయితే ఏమి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఒకప్పుడు హార్డ్వర్డ్ యూనివర్సిటీ అప్లై చేస్తే తొలగించారు. ఇప్పుడు అదే యూనివర్సిటీ జాక్ మా జీవితాన్ని పాఠాలుగా చెబుతున్నారు.