మొటిమలు శాశ్వతంగా తగ్గాలి అనుకుంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి....!

మొటిమలు శాశ్వతంగా తగ్గాలి అనుకుంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి....!



మగ వాళ్లకు కానీ ఆడ వాళ్లకి కానీ వచ్చే మొటిమలు సులువుగా తగ్గాలి అని అందరికి ఉంటుంది. ఆ మొటిమలు వచ్చిన భాగములో మొటిమ పోయిన తర్వాత చర్మము మళ్లీ ముందుటి లాగా రావాలి అనే కోరిక ఉంటుంది. దీనికోసము రకరకాల మందులు, ఆయింట్మెంట్స్, క్రీములు వాడుతూ ఉంటారు. వీటి కోసము చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ, ఇలా డబ్బులు ఖర్చు అవసరము లేకుండా నాచురల్ గా లోపలి నుంచి మొటిమలు తగ్గి, ఆ మొటిమ భాగము లో పడిన మచ్చ పోయి ముందు ఉన్న చర్మము మళ్లీ రావటానికి, న్యాచురల్ గా మనము తగ్గించుకోవచ్చు. సౌందర్యాన్ని ముఖ భాగములో పెంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని విషయాలను మీ అందరికీ అందించబోతున్నాను.

సులభమైన కొన్ని చిట్కాలు

  • మొటిమలు వచ్చిన భాగములో చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. అలా మొటిమను గిల్లటము అనే అలవాటు మానుకోవడము మంచిది. అలా మొటిమల్ని గిల్లటము వలన ఆ చర్మ భాగములో గుంతలు పడుతుంటాయి. అదే మొటిమ అనేది దాని అంతట అదే పగిలి, వేస్ట్ బయటికి వచ్చేస్తే ముఖము మీద గుంతలు పడకుండా ఉంటాయి. అంతేకాదు, మనము గిల్లటము వలన కొంచెము ఇన్ఫెక్షన్ వచ్చి నల్లగా మచ్చ పడడము జరుగుతుంది. అంతేకాదు స్నానము చేసేటప్పుడు మొటిమలు ఉన్న భాగములో గట్టిగా రుద్దకూడదు, తుడవకూడదు.
  • వారములో మూడు లేదా నాలుగు రోజులైనా వేడి నీళ్లతో ఆవిరి పెట్టుకోవడము మంచిది. ఈ ఆవిరి పెట్టుకోవడానికి ముందు కాస్త తేనెను మొటిమల భాగములో పూసి కొంచెము సేపు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లలో కొంచెము పసుపు వేసి ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఇలా వారానికి మూడు లేక నాలుగు రోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి. ఆవిరిలో పసుపు వలన చర్మములోని నాడాలలో వ్యర్థము అంతా చెమట రూపము లో బయటికి వచ్చేస్తుంది.
  • చర్మము పై ఉన్న మొటిమలు, మచ్చలు పోయి మంచి రంగు రావాలంటే పొలాల్లోని నల్లటి మట్టిని, పై భాగము లో ఉన్న మట్టిని తీసేసి అడుగు భాగములో ఉన్న మట్టిని తీసుకొని ఎండ పెట్టేసి మెత్తగా పౌడర్ చేసుకుని నీళ్లలో వేసి నానబెట్టిన తర్వాత ముఖానికి పట్టించుకోవాలి. ఒక అర్థగంట వరకు ఉంచుకొని తర్వాత శుభ్రము చేసుకోవాలి. ఈ మట్టిని ముఖానికి పటించుకోవడము వలన చల్లదనంగా ఉంటుంది. ఈ చల్లదనానికి రక్త ప్రసరణ అంతా ముఖానికి వస్తుంది. ఇలా రావడము వలన చర్మము మీద ఉన్న వ్యర్ధాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, స్కిన్ సెల్స్ హెల్తీగా అవుతాయి.
  • లోపలి నుంచి మొటిమలు రావటము తగ్గాలి అంటే హార్మోన్ మార్పు వలన వయసులో ఉన్న పిల్లలకి వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండటానికి రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్లు త్రాగటము మంచిది. ఇలా మంచినీళ్లు బాగా తాగడము వలన రక్తములో ఉండే వ్యర్ధాలు అన్ని ఎప్పటికప్పుడు బయటికి పోతాయి. రక్తము శుద్ధి అవుతుంది. నీళ్లు తక్కువ తాగడము వలన కూడా వ్యర్ధాలు బయటికి పోక నిలువు ఉండి ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమవుతాయి. అందంగా ఉండాలి అనుకుంటే రోజుకి నాలుగు లీటర్లు నీటిని త్రాగాలి. 
  • రోజుకు శరీరము లోపలికి 30 నుంచి 40 శాతము వరకు మంచి ఆహారము తీసుకునే ప్రయత్నము చేయాలి. పండ్ల రూపములో లేదా జ్యూస్ రూపము లో 30 నుంచి 40 శాతం వరకు తీసుకుంటే మంచిది. ముఖము పై ఉన్న మచ్చలు మానాలి అంటే విటమిన్ - సి, విటమిన్ - ఏ ఎక్కువగా ఉండే జ్యూస్ లు తీసుకోవడము మంచిది. రోజుకు రెండు పూటలా జ్యూస్ తాగితే త్వరగా మచ్చలు తగ్గుతాయి. రోజు ఉదయము పూట క్యారెట్, బీట్రూట్, కిరా ఇవన్నీ కలిపి అందులో కావాలి అంటే కొత్తిమీర లేదా పుదీనా వేసుకొని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకుని అందులో కొంచెము తేనె కలిపి త్రాగండి. ఇందులో మంచి ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ జ్యూస్ ముఖము పై ఉన్న మచ్చలు మానడము కోసము బాగా ఉపయోగపడుతుంది. మళ్లీ సాయంత్రం పూట కమలా పండు లేదా బత్తాయి పండు జ్యూస్ కానీ ఒక గ్లాస్ తీసుకుంటే మంచిది. రోజుకు రెండు పూటలా జ్యూస్ తాగటము వలన ముఖము మీద పింపుల్స్ రాకుండా ఉంటాయి. అలాగే ముఖము పై ఉన్న మచ్చలు కూడా త్వరగా తగ్గిపోతాయి.
  • మూడు పూట్ల తినే ఆహారము లో ఒకపూట డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇలాంటివి తినడము వలన కూడా ముఖము పైన మొటిమలు రాకుండా ఉంటాయి.

ఈ నియమాలు ఆచరిస్తూ ఆహారము మంచిగా తిన్నారంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించి మొటిమలు తగ్గుతాయి. ఇలా రోజు చేస్తూ ఉంటే లోపలి నుంచి మొటిమలు రాకుండా తగ్గిపోతాయి. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గిపోతాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!