అమర్‌నాథ్ వెనుక ఉన్న చరిత్ర......
శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ ఆలయము భారతదేశంలోనే ప్రధాన తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సముద్ర మట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయము ఉంది. ఈ ఆలయము శివ భక్తులలో చాలా ప్రాచుర్యము పొందింది. మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన శివలింగము ఇక్కడ ముఖ్య ఆకర్షణ. ఈ ఆలయానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అంటే అమరమైన, నాథ్ అంటే దేవుడు.
అమర్నాథ్ ఆలయము కథ
హిందూ మత పురాణాల ప్రకారము శివుని భార్య అయిన పార్వతిదేవి తనకు అమరత్వము యొక్క రహస్యాలను బహిర్గతము చేయమని అభ్యర్థించింది. అప్పుడు శివుడు ఎవరి చెవినా రహస్యము పడకూడదు అనే ఉద్దేశ్యంతో పార్వతీ దేవిని హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గృహలకు తీసుకువెళ్లి జీవిత రహస్యాలు వెల్లడించాలి అనుకున్నారు. హిమాలయాలకు వెళ్లే దారిలో పరమశివుడు తన తలపై ఉన్న చంద్రుని చందన్ వారి వద్ద, తన వృషభం నందిని పెహల్గాం వద్ద వదిలి వెళ్లారు. తర్వాత శివుడు తన తనయుడు గజదేవుడు అయినా గణేశుని మహా గుణాష్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్ నాగ్ వద్ద విడిచిపెట్టారు. తర్వాత మహాశివుడు పంచభూతాలని పంచ్ రత్న వద్ద వదిలి గృహల్లోకి వెళ్లారు. అప్పుడు శివుడు తన మాటలను ఎవ్వరూ వినకుండా ఉండేందుకు గృహలో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనము చేశారు. అయితే అప్పుడు శివుడు గమనించకుండా పోయిన జింక చర్మము కింద ఉన్న రెండు పావురము గుడ్లకు మాత్రము ఎటువంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు శివుడు రహస్యని వివరిస్తూ ఉండగా నిశ్శబ్దంగా పొదిగి మాటలను దొంగ చాటుగా వినేశాయి. శివుని రహస్యము చాటుగా విన్న ఆ రెండు పావురాలు మరలా మరలా జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే ఆ రెండు పావరాలు అమర్నాథ్ గృహను తమ నిత్య నివాసంగా చేసుకున్నాయి. అమర్నాథ్ గృహ చేరుకోగానే యాత్రికులు ఆ పావురాల జంటని చూడవచ్చు.
6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన నీల మాత పురాణములో ఈ ప్రసిద్ధ యాత్ర స్థలాన్ని గురించి పేర్కొన్నారు. ఈ పురాణము కాశ్మీరిలా కర్మకాండను మరియు వారి సంస్కృతిక జీవనశైలిని వివరిస్తుంది.
అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న రాజులు
క్రీ.స్తు 134 లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజుతో కూడా అమర్నాథ్ ఆలయము ముడిపడి ఉంది. కాలక్రమములో ఈ రాజు తన రాచరిక హక్కును విసర్జించారు. ఆ రాజు వేసవులలో అతను ఇక్కడికి చేరుకొని సహజంగా మంచుతో తయారైన శివలింగాన్ని పూజించారు. రాజ తరంగణిలో కూడా అమర్నాథ్ అమరేశ్వర్ గా పేర్కొంది. 1420 నుంచి 1470 మధ్య జరిగిన తన అమర్నాథ్ యాత్ర కాలములో సుల్తాన్ జైయిన్ అనే రాజు శకోల్ అనే కాల్వ నిర్మించారు.
సహజంగా ఏర్పడిన మంచు లింగము
అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులకు 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గృహకు కచ్చితంగా వెళ్తారు. ఈ గృహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగము ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగము పెరగడము తరగడము జరుగుతుంది. మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది. ఈ గృహ 5000 వేల సంవత్సరాల కాలము నాటిది. ఈ గృహలో శివుడు పార్వతీదేవికి అమరత్వము ఉపదేశించిన ప్రదేశముగా ఉంది. గణేశునికి, పార్వతీదేవికి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి.
శేష్ నాగ్ సరస్సు
శేష్ నాగ్ సరస్సు అమర్నాథ్ లోని ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పెహల్గాంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 3650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశము జూన్ వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవికాలంలో అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులు ఈ సరస్సుకి భారీ సంఖ్యలో వస్తారు.
అమర్నాథ్ యాత్రకు అనుమతి
భారతీయ సైన్యము, భారతీయ పారా మిలటరీ దళాలు ఈ ప్రదేశానికి కాపలా కాస్తూ ఉంటారు. అందువలన అమర్నాథ్ గృహను సందర్శించడానికి ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి.
అమర్నాథ్ ప్రాంతంలో ఉన్న వాతావరణము
అమర్నాథ్ ప్రాంతములో వేసవికాలంలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలము లో విపరీతమైన చల్లిగా ఉంటుంది. మైనస్ 5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. ఏడాదిలో ఏ సమయములో అయినా వర్షాలు పడొచ్చు. వర్షాలు అమర్నాథ్ యాత్రకు అడ్డంకిగా మారుతాయి. అమర్నాథ్ ఆలయాన్ని దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్య నెలలు మంచి సమయము.