అందం కోసము ఈ సింపుల్ టిప్స్

అందం కోసము ఈ సింపుల్ టిప్స్:




ప్రతి ఒక్కరూ అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు. చాలామంది అందంగా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా కనిపించడానికి చాలా రకాల లోషన్స్, క్రీమ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. కానీ, ఇలాంటి వాడటము వల్ల అప్పుడు బాగుంటుంది కానీ తర్వాత మెల్లమెల్లగా చర్మము పాడైపోతుంది. అందుకని ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో అందంగా అవ్వచ్చు. ఇంట్లో నుంచే తయారు చేసుకునేలా కొన్ని ఫేస్ ప్యాక్స్ ఇప్పుడు తెలుసుకున్నాము.

టాన్ పోవడానికి చిట్కాలు

  • శనగపిండి, పసుపు, తేనె, రోజ్ వాటర్ నాలుగు బాగా కలిపి ముఖానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడము వలన ముఖముపై ఉన్న టాన్ తొలగిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితము లభిస్తుంది.
  • శనగపిండి, కలబంద జెల్ రెండు బాగా కలిపి ముఖానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖము మీద ఉన్న టాన్ పోతుంది.
  • కాఫీ పౌడర్ లో తేనె కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖము పై ఉన్న టాన్ పోతుంది.
  • ఆలివ్ ఆయిల్ ని ముఖానికి పట్టించి పది నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడము వలన ముఖము మీద ఉన్న టాన్ తగ్గుతుంది. ఇలా వారానికి నాలుగు సార్లు చేసుకుంటే మంచి ఫలితము వస్తుంది.
  • రోజ్ వాటర్ లో కలబంద జెల్ కలిపి స్ప్రే బాటిల్ లో వేసుకొని ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ముఖానికి స్ప్రే లాగా చేసుకొని ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయటము వలన ఎండ నుంచి వచ్చిన టాన్ తగ్గుతుంది.
  • ఓట్స్ పౌడర్ లో పాలు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయటము వలన ముఖముపై ఉన్న టాన్ తగ్గుతుంది.

చర్మం మృదుత్వము కోసము

  • శనగపిండిలో పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించి, 30 నిమిషాల తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన చర్మము మృదువుగా మారుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
  • కలబంద జెల్ లో ఒక విటమిన్ - ఈ ఆయిల్ కలిపి ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడము వలన చర్మము మృదువుగా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితము ఉంటుంది.
  • వెన్నలో కొంచెము పసుపు కలిపి ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించుకోని 20 నిమిషాల తర్వాత స్నానము చేయాలి. ఇలా వెన్న పట్టించుకోవటము వలన చర్మము మృదువుగా ఉంటుంది.
  • స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెని ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించి, 30 నిమిషాల తర్వాత స్నానము చేస్తే చర్మము ఎంతో మృదువుగా ఉంటుంది.
  • రైస్ క్రీమ్ లో కొంచెము తేనె కలిపి ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వల్ల ముఖము మృదువుగా మారుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచిది.

పింపుల్స్ తగ్గించుకోవడము

  • కలబంద గుజ్జులో కొంచెము పసుపు కలిపి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పట్టించాలి. ఇలా రోజు పట్టించుకోవడము వలన పింపుల్స్ తగ్గిపోతాయి.
  • నిమ్మకాయ జ్యూస్ లో కొంచెము బేకింగ్ సోడా కలిపి పింపుల్స్ ఉన్న చోట పట్టించి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా వరానికి రెండుసార్లు చేస్తే త్వరగా పింపుల్స్ తగ్గిపోతాయి.
  • 1 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనే, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ మూడిటిని బాగా కలిపి ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన పింపుల్స్ త్వరగా తగ్గిపోయి, రాకుండా ఉంటాయి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితము లభిస్తుంది.
  • పెరుగులో కొంచెము పసుపు కలిపి ముఖానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత చల్లని నీటిలో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితము వస్తుంది.
  • కమలా పండు జ్యూస్ లో కొంచెము బియ్యప్పిండి, పసుపు కలిపి పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన ముఖము పైన పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచిది.
  • రాత్రిలు నిద్రపోయే ముందు ముఖానికి రోజ్ వాటర్ పట్టించి, ఉదయాన్నే నిద్ర లేవగానే నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన ముఖము మీద ఉన్న పింపుల్స్ తగ్గిపోతాయి. ఇలా రోజు చేయొచ్చు.

స్కిన్ వైట్నింగ్

  • క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ రెండు కలిపి ఫ్రిజ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ ని రోజు ముఖానికి పట్టించుకోవాలి. ఇలా చేయడము వలన చర్మము తెల్లగా మారుతుంది. ఇలా రోజు చేయడము వలన మంచి ఫలితము లభిస్తుంది.
  • శనగపిండిలో బీట్రూట్ జ్యూస్ కలిపి ముఖానికి, కాళ్ళకి, చేతులకు పట్టించి, 30 నిమిషాల తర్వాత స్నానము చెయ్యాలి. ఇలా చేయడము వలన చర్మము తెల్లగా మారుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మము తెల్లగా మారుతుంది.
  • ఆలు జ్యూస్ ని ఐస్ క్యూబ్ లాగా చేసుకొని ముఖానికి పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడము వలన చర్మము తెల్లగా మారుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
  • ఆలు జ్యూస్ లో బియ్యము పిండి కలిపి పేస్ లాగా చేసి ముఖానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన చర్మము తెల్లగా అవుతుంది.

ఫ్యాక్స

1. పసుపు పడని వాళ్ళు పసుపుకి బదులుగా వేరేది ఏదైనా వాడొచ్చా?
జ. పసుపుకి బదులు శనగపిండి లేకపోతే బియ్యప్పిండి కానీ తీసుకోండి మంచిది.

2. రాత్రిలు నిద్రపోయే ముందు కలబంద జెల్ ని అట్లే పెట్టుకొని నిద్ర పోవడము వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
జ. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ, కొంచెము పింపుల్స్ ఉన్నచోట నవ్వ వస్తుంది. కానీ, పింపుల్స్ పోయిన తర్వాత ఎలాంటి నవ్వ ఉండదు. పింపుల్స్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెము నవ్వ ఉంటుంది.

3. బీట్రూట్ జ్యూస్ వల్ల చర్మము ఎర్రగా మారుతుందా?
జ. బీట్రూట్ రంగు చార్మానికి అంటుకోదు. కానీ, స్కిన్ వైట్నింగ్ తెలుస్తుంది. అయితే పట్టించాక సబ్బుతో ముఖము కడుకోవాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!