కమలా పండు వలన కలిగే అద్భుతమైన లాభాలు......
కమలా పండు వలన కలిగే లాభాలు
- కమలా పండును రోజు తినడం వలన కాల్షియం, ఐరన్ వస్తుంది. ఎముకలు, కండరాలను కూడా దృఢంగా చేస్తుంది.
- ఇందులో ఫైబర్ ఉండడం వలన త్వరగా ఆకలి కాకపోవడంతో త్వరగా బరువు తగ్గుతారు.
- కమలా పండు జ్యూస్ ని రోజు తాగడం వలన బరువు తగ్గుతారు.
- కమలా పండు జ్యూస్ తాగడం వలన ముఖము ఎంతో తాజాగా ఉంటుంది.
- కమలా పండు ని రోజు తీసుకోవడం వలన ముఖానికి పింపుల్స్, ముడతలు వంటివి తగ్గుతాయి. వయస్సు కూడా తగ్గినట్టు గా యంగ్ గా కనిపిస్తారు.
- జలుబు, దగ్గు వచ్చినప్పుడు కమలా పండు ను తినడం వలన త్వరగా జలుబు, దగ్గు తగ్గుతాయి.
- తరచుగా కమలా పండు ని తీసుకోవడం వలన చలికాలంలో వచ్చే వైరస్ ని రానీయకుండా చేస్తుంది.
- రోజు కమలా పండు ని ఆహారములో తీసుకోవడం వలన చర్మం కూడా తెల్లగా అవుతుంది. అంతేకాకుండా చర్మం మీద డల్ నెస్ తగ్గిస్తుంది.
- తరచుగా కమలా పండు తీసుకోవడం వలన క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది.
- రోజు కమలా పండు తీసుకోవడం వలన గుండె సమస్యలు రానీయకుండా చేస్తుంది.
- కమలా పండు ని తరచుగా తీసుకోవడము వలన బ్లడ్ ప్రెజర్ ని కూడా తగ్గిస్తుంది.
- డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కమలా పండు చాలా మంచిది. రోజు ఒక కమలా పండు తినడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
- కమలా పండు ను రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవడం వలన నిద్ర బాగా వస్తుంది.
- చిన్నపిల్లలు కమలా పండు ను తినడం వలన వాళ్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది అంతేకాదు వాళ్లు చదివింది కూడా బాగా గుర్తుకు ఉంటుంది.
- పెద్ద వయస్సు వాళ్లకు కూడా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
- కమలా పండును రోజు రాత్రి తినడం వలన లివర్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
- మన బాడీలోని సోడియం ని తగ్గిస్తుంది. దీనివలన శరీరంలోని ప్రెజర్ ని తగ్గిస్తుంది.
కమలా పండు తో అందము
- 3 స్పూన్స్ కమలా పండు జ్యూస్ లో 1 స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వలన ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి.
- 5 స్పూన్స్ కమలా పండు జ్యూస్ లో 1 స్పూన్ సెనగపిండి కలిపి ముఖానికి పట్టించి ఒక 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వలన పింపుల్స్ రాకుండా చేస్తుంది.
- చలికాలంలో మొఖం పగలకుండా ఉండటానికి కమలా పండు జ్యూస్ లో కొంచెం అలోవెరా జెల్ కలిపి ముఖానికి, చేతులకి పట్టించడం వలన శరీరం పగలకుండా ఉంటుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా కూడా మారుతుంది.
- కమలా పండు తొక్కను ఎండపెట్టి పొడిని అలోవెరా జెల్ తో కలిపి పట్టించుకోవడం వలన ముఖము కాంతివంతంగా అవుతుంది.
- కమలా పండు తొక్కను ఎండలో ఎండబెట్టి దాని పొడి చేసుకుని ఆ పొడిలో కొంచెం పెరుగు కలిపి పేస్ట్ లాగ చేసుకుని ముఖానికి పట్టించి ఒక 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖము మృదువుగా, తాజాగా ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖము మృదువుగా మారుతుంది.
- కమలా పండు, బొప్పాయ రెండు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వలన ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ తగ్గిపోతాయి.
- 1 స్పూన్ వేపాకు పొడిలో తగినంత కమలా పండు జ్యూస్ వేసి పేస్ట్ లా చేసుకుని ఇది ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మీద వచ్చే అలర్జీలను తగ్గిస్తుంది.
- కమలా పండుగ రోజు ఆహారంలో తీసుకోవడం వలన జుట్టు కూడా దృఢంగా అవుతుంది.కమలా పండు జ్యూస్ లో తగినంత చక్కెర కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ లాగా చేసుకుంటే ముఖము తెల్లగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
ఫ్యాక్స
1. ఈ పండుని రోజు తీసుకోవడం వలన ఏమైనా సమస్య వస్తుందా?
జ. ఈ పండుని రోజు తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు రావు.
2. ఆరెంజ్ జ్యూస్ లో చెక్కర వేసుకొని తాగొచ్చా?
జ. త్రాగవచ్చు, కానీ చక్కెర లేకుండా తీసుకుంటే మరీ మంచిది. చెక్కర బదులుగా తేనె, బెల్లం వేసుకొని తీసుకుంటే మంచిది.
3. కమలాపండు తొక్కని ఆహారంలో తీసుకోవచ్చా?
జ. తీసుకోవచ్చు, కాకపోతే ఆహారంలో వాసన కోసం ఎక్కువ మంది కమలా తొక్కను ఉపయోగిస్తారు.
4. కమలా పండు చూసిన తలకు ఉపయోగించవచ్చా?
జ. లేదు, ఆహారంలో కమలా పండును తీసుకోవడం వలన జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది.
5. కమలా పండును చలికాలంలో తీసుకోవడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయా?
జ. కమలా పండుని చలికాలంలో తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలను రాకుండా చేస్తుంది.
6. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు కమలా పండును తీసుకోవచ్చా?
జ. తీసుకోవచ్చు, కమలా పండు వైరల్ జ్వరాలను కూడా త్వరగా తగ్గిస్తుంది.
7. అలర్జీనెస్ ఉన్నవాళ్లు కమలాపండును తీసుకోవచ్చా?
జ. తీసుకోవచ్చు, ఏమీ కాదు.
8. డయాబెటిస్ ఉన్నవారు రోజు ఈ కమలా పండును తినవచ్చా?
జ. తీసుకోవచ్చు, డయాబెటిస్ ఉన్న వారికి ఈ పండు మరీ మంచిది. వాళ్ళు రోజు ఈ కమలా పండు ను తీసుకోవడం వలన డయాబెటిస్ ఏమి పెరగదు, కంట్రోల్ లో ఉంటుంది.
9. కమలా పండును అలాగే తీసుకోవడం మంచిదా లేకుంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిదా?
జ. ఏదైనా సరే పండ్లు అలాగే తినడమే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా, అందులోని పోషక విలువలు అన్నీ మనకు అందుతాయి. జ్యూస్ కన్నా పండు ను తీసుకోవడం మంచిది.