భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవిత చరిత్ర.....

భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవిత చరిత్ర.....


కాగితాల మీద ఉంటే కేవలము అవి అక్షరాలు మాత్రమే. అదే అతని కలము నుండి జారు వాలితే అది అగ్నిజ్వాలలు. స్వాతంత్ర ఉద్యమములో కొందరు కత్తులతో పోరాడితే వీరు కలంతో కదం తొక్కారు. స్వేచ్ఛ స్వర్గములోకి నా దేశాన్ని నడిపించమని వెలుగెత్తి చాటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కి పర్యాయపదంగా మారారు. గొప్ప రచయితగా, సంగీత వేతగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, వీటన్నిటికీ మించి గొప్ప మానవతావేతగా నిలిచారు. మరి ఎవరో కాదు వీరే "రవీంద్రనాథ్ ఠాగూర్" గారు.ఈ ప్రపంచము వీరిని "విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్" గా పిలుస్తారు. దశాబ్దాలు గడుస్తున్న వారు అందించిన సాహిత్య పరిమళంలో ఈ విశ్వము ఇప్పటికీ తేలి ఆడుతూనే ఉంది.


రవీంద్రనాథ్ ఠాగూర్ తల్లిదండ్రులు

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7న కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమీందారీ కుటుంబములో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదా దేవి. ఈ దంపతులకు 13వ సంతానము లో జన్మించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. బెంగళూరు భాషలో ఠాగూర్ అంటే అయ్యా అని అర్థము. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కుటుంబము జమీందారుల కుటుంబము కావడంతో అందరూ వీరిని ఠాగూర్ అని పిలిచేవారు. తల్లి శారదా దేవి అతని చిన్నతనములోనే మరణించారు. దీనితో ఈయన నౌకర్ల చేతులతోనే పెరిగారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సోదరులు

రవీంద్రుడి జేష్ఠ సౌదరుడైన విజయేంద్రనాథ్ ఠాగూర్ గారు సమాజములో గౌరవము పొందిన కవి, తత్వవేత్త. మరియొక సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రిటిష్ ప్రభుత్వము నుండి ఐసిఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరియొక సోదరుడు జ్యోతింద్రనాథ్ ఠాగూర్ నాటక ప్రయుక్త సంగీతకారులు. అందువలన వీరి జమీందారు బంగ్లా మొత్తం ఎప్పుడూ నాటకాలతో, సాహిత్యాలతో, బెంగాలీ సభ సంగీతాలతో కళకళలాడుతూ ఉండేది.


రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యాభ్యాసము

రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వర్ణకుమారి. స్వర్ణకుమారి గారు రచయిత్రి. సోదరి రచయిత్రి కారణముగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాఠశాలలకు వెళ్ళవలసిన అవసరము లేకుండా పోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్యము చాలా చోద్యంగా గడిచింది. ఆముదము దీపము ముందు పుస్తకము పట్టుకొని కూర్చుని చదివేవారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పర్వశిస్తూ ఉండేవారు. కథలు అంటే చెవి కోసుకునే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగారు. బాల్యములో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావడముతో ఆయనకి బయట ప్రపంచము అద్భుతంగా తోచేది.

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రపంచము ఒక రహస్యమని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహల పడేవారు. ఇలా పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను చదివేవారు. సాయంత్రము చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషును అభ్యసించడము చేసేవారు. ఆదివారాలలో సంగీతం, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, సాంస్కృత వ్యాకరణము నేర్చుకునే వారు. బెంగాలీతోపాటు ఆంగ్ల భాషలోను పట్టు సంపాదించారు. కాళిదాసు, షేక్ స్పీయర్ రచనలు ఎక్కువగా చదివేవారు. సాహిత్యానికి, బహుభాషా పాండిత్యాని, లలిత కళలకు, ఆధ్యాత్మికచింతనకు చిన్నతనము నుంచి వీరి ఇంటిలో ఇవన్నీ చూస్తూ పెరిగారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటి కవితకి అనువాదము

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 8 ఏళ్ల వయసులోనే ఒక ఫ్రెంచ్ కవితకి అనువాదము చేశారు. ఈ పద్య సంపుటిని భాను సింహా అని పిలిచేవారు. అయితే దానిని ఆనాటి బెంగాలి పండితులు ఆమోదించలేదు.

రవీంద్రుడికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ కి వెళ్లేవారు. ఆ సమయములోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలను చదివారు. ఆ తర్వాత తానే స్వయంగా రాయడము ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మొదటి నుంచి సాహిత్యము అంటే విపరీతమైన ఇష్టము ఉండేది.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బారిస్టర్ చదవడము కోసము ఇంగ్లాండుకు వెళ్లారు

రవీంద్రనాథ్ ఠాగూర్ ని బారిస్టర్ ని చెయ్యాలి అనేది తన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి కోరిక. ఈ కోరిక మేరకు 1878 వ సంవత్సరములు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ కు వెళ్లారు. ఇంగ్లాండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మానేసి షేక్ స్పీయర్ రచనలు చదివేవారు. అయితే తండ్రికి మాత్రం బారిస్టర్ చదువు చదువుతూ ఉన్నానని చెప్పేవారు. చివరకు విద్యను ముగించుకొని 1880లో స్వదేశము చేరుకున్నారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వివాహము

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చదువు విషయము తండ్రికి తెలియడముతో 1883లో మృనాలి దేవితో వివాహము చేయించారు. కొద్ది రోజులు జమీందారీ ఎస్టేట్ ని చూసుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1901 లో శాంతినికేతన్ కు మక్కా మార్చుకున్నారు. శాంతినికేతన్ లో ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇద్దరు పిల్లలు, భార్య మృణాళిని గారు మరణించారు. దానితో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీవ్ర విషాదములో కృంగిపోయారు. అది జరిగిన మరో నాలుగు సంవత్సరాలకు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు మరణించారు. దాంతో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి జమీందారీ జీవితముపై పూర్తిగా ఆసక్తి నశించింది. దీంతో రాజభోగాలను విడిచిపెట్టి రచన వ్యాసంగంలోనే ఎక్కువగా ఉండేవారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి భార్యా, ఇద్దరు పిల్లలు, తండ్రి మరణించడము తో తాను ఎక్కువ సమయాన్ని రచనల మీద దృష్టి పెట్టారు. ఆ సమయములోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి అనే గొప్ప కావ్యాన్ని రచించారు. దీనిలో బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లములోకి అనువదించారు. అనంతరము దీన్ని అనేక ప్రపంచ భాషలోకి అనువదించారు. ఈ కావ్యము ప్రపంచ సాహిత్యములో ఒక గొప్ప రచన. మానవుని కృంగతీసే నిరాశ నిస్పృహలు సకల సృష్టిని ప్రేమ భావముతో చూసి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశము గీతాంజలి లోని ముఖ్య అంశము. గీతాంజలి రచనకే 1913వ సంవత్సరములో సాహిత్యములో నోబుల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. అంతేకాదు నోబెల్ పొందిన తొలి భారతీయుడుగా, ఆసియా ఖండంలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.


బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి తిరస్కరించారు

నోబుల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి రవీంద్రనాథ్ ఠాగూర్ కు నైట్ బిరుదు ప్రధానము చేశారు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ దేశభక్తికి ఆ బిరుదుని త్యాగము చేసారు. జలియన్‌వాలా బాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యము భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనలో తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఇచ్చిన నైట్ బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వసించే బ్రహ్మ సమాజ సిద్ధాంతము

రవీంద్రనాథ్ ఠాగూర్ బలంగా బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు. ఈ సిద్ధాంతము ప్రకారము విశ్వములోని మానవులంతా ఒక్కటే. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మము ఒక్కటే అందరికీ దైవము అని ప్రచారం చేసి విశ్వ కవి గురుదేవ్ లను శాశ్వతము చేసుకున్నారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయగీతము

స్వాతంత్రము తర్వాత భారతదేశానికి జాతీయ గేయాన్ని రాసే అవకాశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కి వచ్చింది. కానీ 1896లో అప్పటికే బకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరము గీతాన్ని జాతీయగీయంగా అమలుపరచునున్నారని అందరూ అనుకున్నారు. కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమనను జాతీయగీతముగా ప్రకటించారు. ఈ సందర్భములో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ జనగణమన మరియు వందేమాతరము రెండు గేయాలు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టము చేశారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మరణము

1941 కి వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆరోగ్యము బాగా క్షీణించింది. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయ్యిన ఏ.కె.సిన్ అనే మిత్రుడిని ని పిలిచి తన తుది సందేశాన్ని చెప్పారు. "నా జన్మ మధ్యలోనే అంతరిస్తుంది. ఈ సమయములో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమి తల్లి శాశ్వత ప్రేమ, మానవుల అందరి ఆశీస్సులను నాతో తీసుకొని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈరోజు నేను ఖాళీ సంచి తో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచము లేని చోటికి శాశ్వత ఆనందముతో వెళ్తాను" అని రాయించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్ని ఇచ్చిన కవి 1941 వ సంవత్సరము ఆగస్టు 7వ తేదీ తుది శ్వాస విధించారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇతర దేశాలకు రాసిన జాతీయ గీతము

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొత్తం మూడు దేశాలకి జాతీయ గీతాన్ని రాశారు. మన భారతదేశము, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు జాతీయ గీతము రచించారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

  • మొదటి నోబెల్ బహుమతి మన ఇండియాకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వల్లే వచ్చింది.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి ద్వారా వచ్చిన డబ్బుతో విశ్వ భారతీయ యూనివర్సిటీ ని స్థాపించారు. ఈ యూనివర్సిటీలోనే ఇందిరా గాంధీ గారు చదువుకున్నారు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చిన నోబెల్ బహుమతి ని 2004వ సంవత్సరములో విశ్వభారతి యూనివర్సిటీలో నుంచి దొంగతనము చేశారు.
  • మహాత్మా గాంధీ గారికి మహాత్మా అని బిరుదుని ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.
  • మహాత్మా గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవ్ అని పిలిచేవారు.
  • 2230 పాటలను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొత్తం 2500 పెయింటింగ్స్ ని వేశారు.
  • ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరియు రవీంద్ర ఠాగూర్ మధ్య మంచి స్నేహబంధము ఉండేది.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి అయిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒక గొప్ప రచయిత.

పాఠశాలలకు వెళ్లిన, వెళ్తున్న ఎందరో సాహిత్యములో సాధించలేని ప్రతిభ పాఠాలను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంటి వద్ద నుంచే సాధించారు. అంతేకాదు, ఆయన రచనలకి నోబుల్ బహుమతి రావడము చెప్పుకోదగ్గ విషయము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!