ఓట్స్ వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

ఓట్స్ వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...


ఓట్స్ మంచి పౌష్టికాహారము దీనిలో పీచు పదార్థము, విటమిన్ బి2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి. ఒక కప్పు ఓట్స్ లో 80% క్యాలరీలు ఉంటాయి. పిల్లలకు ఆహారములో ఓట్స్ ను ఏదో ఒక రూపములో ఇవ్వడము వలన మంచి పోషక విలువలు లభిస్తాయి. రోజు ఓట్స్ తినడం వలన చాలా మంచి లాభాలు ఉన్నాయి.


ఓట్స్ వలన ఆరోగ్య ప్రయోజనాలు

  • శీతాకాలములో అల్పాహారంగా ఓట్స్ మిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఓట్స్ లో పీచు శాతము ఎక్కువగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. బరువు తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటించేవారు ఓట్స్ మిల్ తో తయారు చేసిన వంటకాలను తీసుకోవడము వలన మంచి మేలు కలుగుతుంది.
  • ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పరీక్షల సమయములో పిల్లలకు ఒక కప్పు ఓట్స్ మిల్ లో కొంచెం తేనె కలిపి ఇస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • బ్లడ్ కొలెస్ట్రాల్ ని నియంత్రా స్థాయిలో ఉంచుతూ గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
  • ఓట్స్ మిల్ ని క్రమము తప్పకుండా తీసుకోవడం వలన అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
  • ఓట్స్ లో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తాయి. తరచుగా ఓట్స్ తింటూ ఉంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
  • ఓట్స్ కు జిగురు గుణాన్ని తెచ్చి పెట్టే పీచు రక్తములోని కొలెస్ట్రాల్ ని వేరు చేసి దాన్ని తగ్గించడములో తోడ్పడుతుంది.
  • రోజు ఓట్స్ తీసుకోవడము వలన మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణాలని తగ్గిస్తుంది.
  • 40 గ్రాముల ఓట్స్ లో ఒక రోజుకు సరిపడే మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
  • రక్తములో చక్కెర నిల్వలను నియంత్రించెందుకు ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా మెగ్నీషియం తోడ్పడుతుంది.
  • ఓట్స్ లో ఉండే బీటా కెరిటిన్ అనే ఫైబర్ శరీరములోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
  • తరచూ ఓట్స్ ని తీసుకోవడం వలన చెక్కర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
  • ఓట్స్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ లు శరీరములో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేసి శరీరముపై ఉన్న వాపులను తగ్గిస్తాయి.
  • ప్రతిరోజు ఆహారములో ఓట్స్ ని తీసుకోవడము వలన నడుము చుట్టూ కొలత తగ్గుతుంది. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇది సులభంగా జీర్ణము అవ్వడమే కాకుండా శరీరములోని జీవక్రియల రేటు పెంచడానికి సహాయపడుతుంది.
  • అనేక అనారోగ్యాల సమస్యలను తగ్గుస్తుంది. డిప్రెషన్స్ వంటి మానసిక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • ఓట్స్ మిల్ అనేది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సాహించడానికి అద్భుతమైన అల్పాహారము అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియము, పొటాషియము, సెలీనియం, ఫోలేట్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి.

ఓట్స్ వలన కలిగే అందము

  • ఓట్స్ ని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని అందులో కొంచెము తేనె, పాలు వేసి బాగా కలిపి ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించుకోవాలి. 25 నిమిషాల తర్వాత స్క్రబ్ లాగా చేస్తూ తుడిచేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన నల్లగా ఉన్న చర్మము తెల్లగా అవుతుంది. ఇలా వారానికి ఒక్కసారి చేసుకుంటే మంచి ఫలితము లభిస్తుంది.
  • ఓట్స్ పౌడర్ లో కలబంద గుజ్జు వేసి బాగా కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి, కాళ్లు, చేతులకి పట్టించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్క్రబ్ లాగా చేస్తూ తుడిచేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన చర్మము మృదువుగా మారుతుంది. ఇలా వారానికి ఒక్కసారి చేసుకుంటే మంచి ఫలితము లభిస్తుంది.
  • 1 స్పూన్ ఓట్స్ పౌడర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ తేనే, తగినంత రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వల్లన ఎండ వల్ల కలిగే ట్యాన్ తగ్గుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది.
  • ఓట్స్ పౌడర్ లో తగినంత పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రము చేసుకోవాలి. ఇలా చేయడము వలన ముఖము మీద ఉన్న పింపుల్స్ తగ్గుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పింపుల్స్ పూర్తిగా రాకుండా ఉంటాయి. ఇలా క్రమము తప్పకుండా వాడుతూ ఉంటే ఎప్పటికీ పింపుల్స్ రాకుండా కూడా చేస్తాయి.

కేవలం ఓట్స్ ని మాత్రమే తినడం వలన మన శరీర వ్యవస్థలు నియంత్రణలో ఉండవు. జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. కంటి నిండా నిద్ర, పోషక విలువలు ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటూ క్రమము తప్పకుండా వ్యాయామము చేసినట్లయితే మన ఆరోగ్యము మెరుగుపడుతుంది.

ఫ్యాక్స

1. డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్ మిల్ లో చెక్కర వేసుకొని తినవచ్చా?
జ. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ చెక్కర వేసుకొని తినవచ్చు. అలా అని రోజు షుగర్ ఫ్రీ చెక్కర వేసుకొని తినడము అంతగా మంచిది కాదు. అప్పుడప్పుడు తినవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ లాగా కాకుండా ఓట్స్ ఉప్మా, ఓట్స్ పొంగల్, ఓట్స్ సూప్ ఇలాంటివి చేసుకొని తింటే మంచిది.

2. బరువు పెరగాలి అనుకునేవారు ఓట్స్ ని తీసుకోవచ్చా?
జ. తీసుకోవచ్చు, రోజు కాకుండా వారానికి ఒక రెండు సార్లు అలా తీసుకోవచ్చు.

3. ఓట్స్ ని పాలలో ఊడికించి తినొచ్చా?
జ. తినొచ్చు, సన్నగా అవ్వాలి అనుకునేవారు పాలకు బదులు నీటితో ఊడికేసుకొని తింటే మంచిది. పాలతో ఊడికించి తింటే బరువు పెరుగ్గుతారు.

4. ఓట్స్ ని పాలతో ఉడికించుకొని తినొచ్చా? లేకపోతే నీటితో ఉడికేసుకొని తినొచ్చా? ఎలా తింటే మంచిది?
జ. ఎలా అయినా తీసుకోవచ్చు కానీ, సన్నగా అవ్వాలి అనుకునేవారు నీటితో ఉడికించుకుని తింటే మంచిది. లావుగా అవ్వాలి అనుకునేవారు పాలల్లో ఉడికించుకొని తింటే మంచిది.

5. ఓట్స్ ని నిలువ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చా?
జ. తాజాగా చేసుకుని తింటే మంచి పోషక విలువలు ఉంటాయి. ముందు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉన్నదాని కంటే అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తింటే ఓట్స్ లో ఉన్న మంచి పోషకాలు మనకు అందుతాయి.

6. ఓట్స్ తో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
జ. సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఉండవు. కానీ, రోజు కాకోకుండా పైన చెప్పిన విధంగా చేసుకుంటే మంచిది.

7. ఓట్స్ ని రోజు ఆహారములో తీసుకోవచ్చా? రోజు ఆహారములో తీసుకోవడము వలన ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?
జ. రోజు ఓట్స్ ని ఆహారములో తీసుకోవడము వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. పైన చెప్పిన విధంగా తీసుకోవడము వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

8. ఓట్స్ ని ఏ సమయములో ఆహారములో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?
జ. ఓట్స్ ని ఉదయము లేదా రాత్రి తీసుకుంటే మంచిది. రాత్రిళ్ళు స్వీట్ ఓట్స్ తీసుకోకుపోవడమే మంచిది. స్వీట్ ఓట్స్ కి బదులు ఓట్స్ ఉప్మా, ఓట్స్ పొంగల్, ఓట్స్ సూప్ ఇలాంటివి రాత్రిళ్ళు తీసుకుంటే చాలా మంచిది. రాత్రులు ఓట్స్ లో స్వీట్ లేకుండా చేసుకొని తింటే మంచిది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!