సుందర్ పిచాయ్.......రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ.....!

సుందర్ పిచాయ్.......రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ.....!


ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ ని గూగుల్ పాలిస్తుంటే, గూగుల్ ని సుందర్ పిచాయ్‌ పాలిస్తున్నారు. మన దేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు బ్యాగు కూడా కొనుక్కోలేని స్థాయి నుంచి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందల కోట్లు జీతం అందుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కువ శాలరీ అందుకుంటున్న వారిలో ఒక్కడిగా నిలిచారు. గూగుల్ లో ఒక చిన్న జాబ్ వచ్చినా చాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కానీ ఆయన గూగుల్ కే సీఈఓ అయ్యారు.


సుందర్ పిచాయ్‌ బాల్యము:

సుందర్ పిచాయ్‌ జూన్ 10, 1972 చెన్నైలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. చిన్నప్పటినుండే సుందర్ చదువులో ముందు ఉండేవారు. సుందర్ పిచాయ్‌ కి జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ. సిందర్ పిచాయ్‌ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారు, తనకి క్రికెట్ అవ్వాలని కోరిక ఉండేది. చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే సుందర్ పిచాయ్‌ కి చాలా ఆసక్తి ఉండేది. ఎందుకంటే సుందర్ పిచాయ్ తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం వలన రోజు ఇంటికి వచ్చి తన పని గురించి సుందర్ పిచాయ్‌ కి చెప్పేవారు. సుందర్ పిచాయ్‌ ఐఐటీలో  మెటల్ఆర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. అక్కడ అతనికి సిఎడ్ వచ్చినప్పటికీ, స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది, అప్పుడు వెంటనే యూఎస్ కి  వెళ్లారు. సుందర్ పిచ్చెయ్ యూఎస్ లో మాస్టర్ అండ్ ఎంబీఏ చేసి ఉద్యోగం కోసం వెతకడం ప్రయత్నించారు. అప్పుడు ఒక చిన్న కంపెనీలో మేనేజ్మెంట్ లెవెల్స్ లో పనిచేశారు.


సుందర్ పిచాయ్‌ గూగుల్ లో ఉద్యోగం:

ఆ తర్వాత కొంతకాలానికి ఏప్రిల్ ఒకటి 2004లో గూగుల్ కి సుందర్ పిచాయ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే రోజు గూగుల్ జీమెయిల్ ని లాంచ్ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన సుందర్ పిచాయ్‌ ని వెంటనే అప్పటి గూగుల్ ఒక పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్టుకి మేనేజర్ ని చేశారు. ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టు "గూగుల్ సెర్చ్ టూల్ బార్". ఆ సమయంలో ఈ ప్రాజెక్టు గూగుల్ కి చాలా ముఖ్యమైనది. గూగుల్ సెర్చ్ రెండు సంవత్సరాల ముందు రావడం వలన చాలామంది యూజర్స్ కి కన్వీనియంట్ గా ఉంది. ఒకవేళ ఆరోజు గూగుల్ సర్చ్ లంచ్ అవ్వకపోయి ఉంటే, ఈరోజు మనం ఇంటర్నెట్ బింగ్ ని వాడుకునే వాళ్ళము.

ఈ విధంగా సుందర్ పిచాయ్‌ మొదటి ప్రాజెక్టు గూగుల్ కి చాలా ముఖ్యమైంది గా మారింది. గూగుల్ సెర్చ్ టూల్ బార్ మీద పనిచేసే సమయంలో మైక్రోసాఫ్ట్ యొక్క ప్రతియొక్క స్టెప్ గూగుల్ కి ఎంత ఇబ్బంది కలిగించొచ్చు అని సుందర్ పిచాయ్‌ అనుకున్నారు. ఎందుకంటే రెండు సంవత్సరాల ముందు మైక్రోసాఫ్ట్ బింగ్ ని డిఫాల్ట్ బ్రౌజర్ గా చేసేసి ఉంటే, ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఇంత పాపులారిటీ ఉండేది కాదు.


సుందర్ పిచాయ్‌ క్రోమ్ బ్రౌజర్:

అప్పట్లో ఇంటర్నెట్ ఎక్సప్లరర్, ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్లను ఎక్కువగా వాడేవారు. వీటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే గూగుల్ కూడా బ్రౌజర్ ఉండాలని అనుకున్నారు. ఇది ఆలోచనను తన సీనియర్స్ కి చెబితే వాళ్లు వద్దన్నారు. అప్పటి గూగుల్ సీఈఓ "ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఇది అయ్యేది కాదు" అని అప్పటి గూగుల్ సీఈఓ చెప్పారు. కానీ సుందర్ పిచాయ్‌ పట్టు వదలకుండా గూగుల్ ఫౌండర్స్ కి చెప్పి ఎంతో కష్టపడి ఒప్పిస్తారు. అలా గూగుల్ కి సపరేట్ బ్రౌజర్ ని తయారు చేశారు. అది ఇప్పుడు మనం అందరం వాడుతున్న గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ దెబ్బకి అప్పటి వరకు ఉన్న బ్రౌజర్ అని కనుమరుగైపోయాయి. ఇప్పుడు గూగుల్ ఇంత సక్సెస్ అవ్వడానికి గూగుల్ క్రోమ్ కారణమైతే, ఆ గూగుల్ క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచాయ్‌ కారణం. వెంటనే గూగుల్ సుందర్ పిచ్చాయి ని ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసింది. దాంతో గూగుల్ కి సంబంధించిన ప్రజెంటేషన్ లో సుందర్ పిచాయ్‌ ఎక్కువగా కనబడుతుండేవారు. తర్వాత సుందర్ పిచాయ్‌ గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఓయస్ ఇలాంటి కొత్త కొత్త వాటిని మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. అలా రోజు రోజుకి సుందరి పిచాయ్‌ ర్యాంక్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి పెద్ద కంపెనీలలో సీఈవో గా ఉండమని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ సుందరి పిచాయ్‌ మాత్రం గూగుల్ ని వదిలి వెళ్ళలేదు. గూగుల్ కూడా సుందర్ పిచాయ్‌ ని వదులుకోవాలి అని అనుకోలేదు. 2017 నా గూగుల్ ఎవరు ఊహించని విధంగా సుందర్ పిచ్చాయి ని గూగుల్ సీఈఓ గా ప్రకటించారు. ఒక్కసారిగా సుందర్ పిచాయ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.


సుందర్ పిచాయ్‌ జీతాము:

మన దేశంలో నుంచి వెళ్లిన ఒక కుర్రవాడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకదానిని నడిపిస్తున్నారు. సీఈఓ గా సుందరి పిచాయ్‌ సారథ్యంలో ఇప్పుడు గూగుల్ దూసుకుపోతుంది. మిగిలిన సీఈవోలతో పోలిస్తే సుందర్ పిచ్చాయి వచ్చిన తర్వాత 50% ఎక్కువ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు సుందర్ పిచాయ్‌ జీతం సంవత్సరానికి 12,80,00,00,000. అంటే దాదాపు ఒక రోజుకి 3,50,00,000 అన్నమాట. అంటే ప్రతి సెకండ్ కి సుమారు 400 రూపాయలు.

ఒక అంతర్జాతీయ సంస్థను నడిపిస్తున్న ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. గూగుల్లో అందరూ ఉద్యోగులు ఈయనను గౌరవిస్తారు.


సుందర్ పిచాయ్‌ కి ఒక్క పాప రాసిన ఉత్తరం:

ఒకసారి 7 సంవత్సరాల పాపకు వాళ్ల నాన్నగారు గూగుల్ లో జాబ్ బాగుంటుందని చెప్పారు, గూగుల్ ఆఫీస్ కి సంబంధించిన ఇంటర్నెట్ లో కొన్ని ఫొటోస్ ని ఆ పాపకి చూపించారు. దాంతో ఆ పాప పెద్దయ్యాక గూగుల్ లో జాబ్ చేయాలని వాళ్ళ నాన్నకి చెప్పింది. అంతేకాకుండా ఆ పాపకి కంప్యూటర్స్ అంటే ఇష్టమని, గూగుల్ లో పని చేయాలని ఉందని ఏకంగా సుందర్ పిచాయ్‌ కి ఉత్తరం రాసింది. అయితే దాని గురించి ఆ పాప తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులు తర్వాత ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ ఆ పాప ఉత్తరం కి రిప్లై పంపారు. ఆ పాపని బాగా చదువుకోమని, ఫ్యూచర్లో చదువు అయిపోయాక తన దగ్గర నుంచి వచ్చే జాబ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండమని సుందర్ పిచాయ్‌ ఆ ఉత్తరం లో పేర్కొన్నారు. ఆ ఉత్తరం ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఎంతో బిజీగా ఉండే సుందర్ పిచాయ్‌ ఒక చిన్న పిల్ల ఉత్తరానికి రెస్పాండ్ అవ్వడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సుందర్ పిచాయ్‌ ఇప్పటికి చాలా నిరాడంబరంగా ఉంటారు. ఇప్పటికీ తన చదువుకున్న కాలేజీ విద్యార్థులతో స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ లలో సుందర్ పిచాయ్‌ కూడా ఒకరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!